News October 16, 2024

ఓ వైపు వర్షం.. గ్రౌండ్‌లోనే కోహ్లీ

image

తొలి టెస్టులో సత్తాచాటేందుకు నెట్స్‌లో ప్రాక్టీస్ చేసిన రన్ మెషీన్ విరాట్ కోహ్లీ వర్షం పడుతుండటంతో నిరాశ వ్యక్తం చేస్తున్నారు. వరుణుడు కరుణిస్తే న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు చూపిస్తానన్నట్లు ఆయన ఎదురుచూస్తున్న ఫొటో వైరలవుతోంది. వర్షంలోనూ తన కిట్‌తో గ్రౌండ్‌లో తిరుగుతూ కనిపించారు. ఉదయం 9.30 గంటలకు మ్యాచ్ మొదలుకావాల్సి ఉండగా వర్షం కారణంగా ఇంకా టాస్ కూడా పడలేదు.

Similar News

News October 16, 2024

ఆస్ట్రేలియాలో గెలవాలంటే అతడు బాగా ఆడాల్సిందే: పార్థివ్

image

ఆస్ట్రేలియా పర్యటనలో టీమ్ ఇండియా గెలవాలంటే శుభ్‌మన్ గిల్ కచ్చితంగా బాగా ఆడాల్సి ఉంటుందని మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ అభిప్రాయపడ్డారు. ‘భారత్ తరఫున గత పర్యటనల్లో వన్‌డౌన్ బ్యాటర్ పుజారా అద్భుతంగా ఆడారు. ఇప్పుడు ఆ స్థానంలో గిల్ ఆడుతున్నారు. టెస్టుల్లో గెలుపునకు 3, 4 స్థానాల ఆటగాళ్లు రన్స్ చేయడం కీలకం. ఇది గిల్‌కి రెండో పర్యటన కాబట్టి అతడిని సీనియర్ ప్లేయర్‌గానే పరిగణించాలి’ అని పేర్కొన్నారు.

News October 16, 2024

ఎమ్మెల్యేలపై ఫిర్యాదులు.. సీఎం చంద్రబాబు ఆగ్రహం

image

AP: ఉచిత ఇసుక అంశంలో ఫిర్యాదులు రావడంపై CM చంద్రబాబు సీరియస్ అయ్యారు. దీనిపై చర్చించేందుకే ఎల్లుండి పార్టీ సమావేశం నిర్వహిస్తున్నామని క్యాబినెట్ భేటీలో తెలిపారు. ఇసుక అంశంలో MLAల జోక్యంపై వచ్చిన ఫిర్యాదులపై చర్చిస్తామన్నారు. లబ్ధిదారులపై రవాణా ఛార్జీలు తప్ప ఇతర ఛార్జీలు పడకూడదని, ఇసుక తవ్వుకుని తీసుకెళ్తే రుసుము వసూలు చేయొద్దన్నారు. అక్రమాలు జరగకుండా ఇన్‌ఛార్జ్ మంత్రులు చర్యలు తీసుకోవాలన్నారు.

News October 16, 2024

కొత్త ఫీచర్లను తీసుకొచ్చిన యూట్యూబ్

image

యూట్యూబ్ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. స్లీప్ టైమర్, రీసైజబుల్ మినీ ప్లేయర్, ఫేవరెట్ ప్లే లిస్ట్, బ్యాక్ స్పీడ్ కంట్రోల్ వంటి వాటిని పరిచయం చేసింది. ఈ ఫీచర్లు ఎలా పనిచేస్తాయో స్పష్టంగా వివరించింది. ఒకవేళ యూట్యూబ్ చూస్తూ యూజర్ పడుకున్నా వీడియో పాస్ అయ్యేలా స్లీప్ టైమర్ ఉండనుంది. బ్యాక్ స్పీడ్ 0.25 సెకండ్స్ నుంచి 0.05 సెకండ్స్ చేసుకునేలా వెసులుబాటు కల్పించింది.