News October 16, 2024

ఒక్క సినిమాకు రూ.125 కోట్లు తీసుకున్న స్టార్ హీరో!

image

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘వేట్టయన్’ సినిమాకు ఇప్పటికే రూ.264.31 కోట్ల కలెక్షన్స్ వచ్చినట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. అయితే, ఈ చిత్రం కోసం రజినీ భారీగా రెమ్యునరేషన్ తీసుకున్నారని తెలిపాయి. ఆయన ఏకంగా రూ.125 కోట్లు ఛార్జ్ చేశారట. జడ్జిగా నటించిన అమితాబ్ రూ.7 కోట్లు, రజినీ భార్యగా నటించిన మంజూ వారియర్ రూ.2-3 కోట్లు, ఫహాద్ ఫాజిల్ రూ.2-4 కోట్లు, రానా రూ.5 కోట్లు ఛార్జ్ చేశారని తెలిపాయి.

Similar News

News October 16, 2024

మహాయుతి కూటమి సీఎం అభ్యర్థి ఎవరంటే?

image

వచ్చే నెలలో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సీఎం అభ్యర్థి ఎవరనే దానిపై డిప్యూటీ CM దేవేంద్ర ఫడ్నవీస్ హింట్ ఇచ్చారు. ఆ అభ్యర్థి ఇక్కడే ఉన్నారంటూ, శివసేన అధినేతనే తదుపరి సీఎం అభ్యర్థిగా ఉండే అవకాశం ఉందన్నారు. దీంతో ఏక్‌నాథ్ షిండే పేరును చెప్పకనే చెప్పారు. మరోవైపు ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి కూటమికి సీఎం అభ్యర్థి లేరని సెటైర్లు వేశారు. మహారాష్ట్రలో నవంబర్ 20న ఎన్నికలు జరగనున్నాయి.

News October 16, 2024

ICC హాల్ ఆఫ్ ఫేమ్‌లో కుక్, డివిలియర్స్, నీతూ డేవిడ్

image

అలెస్టర్ కుక్, నీతూ డేవిడ్, ఏబీ డివిలియర్స్‌కు (ICC) హాల్ ఆఫ్ ఫేమ్‌(2024)లో చోటు దక్కింది. కుక్(ఇంగ్లండ్) 161 టెస్టులు- 12,472 రన్స్, 92 ODIల్లో 3,205 రన్స్, 4 టీ20ల్లో 61 రన్స్ చేశారు. నీతూ డేవిడ్(భారత్) 10 టెస్టులాడి 41 వికెట్లు, 92 వన్డేల్లో 141 వికెట్లు తీశారు. డివిలియర్స్(సౌతాఫ్రికా) 114 టెస్టుల్లో 8,765 రన్స్, 228 వన్డేల్లో 9,577 పరుగులు, 78 టీ20ల్లో 1,672 రన్స్ చేశారు.

News October 16, 2024

జైలులోనే చనిపోయేవాడిని: కేజ్రీవాల్

image

ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ BJPపై సంచలన ఆరోపణలు చేశారు. తాను జైలులో ఉన్నప్పుడు తనకు ఇన్సులిన్ ఇవ్వడాన్ని అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రపన్నిందన్నారు. ఒకవేళ తనకు సమయానికి ఇన్సులిన్ అందకపోతే తాను జైలులోనే మరణించేవాడినని పేర్కొన్నారు. తాను ఏ తప్పూ చేయకున్నా BJP సర్కార్ తనను అరెస్ట్ చేయించిందని ఆయన ఆరోపించారు.