News October 16, 2024
సురేఖపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేయనున్న కాంగ్రెస్ నేతలు

TG: మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ మధ్య <<14367710>>వివాదం<<>> ఢిల్లీకి చేరింది. సురేఖపై ఇప్పటికే దీపాదాస్ మున్షీ, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్‌కు వరంగల్ కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. తాజాగా ఆమెపై ఢిల్లీలోని అధిష్ఠానానికి కంప్లైంట్ చేయనున్నారు. సురేఖపై చర్యలు తీసుకోవాలని కోరే అవకాశం ఉంది.
Similar News
News February 5, 2026
గులాబీ నేతలకు ‘చపాతీ రోలర్’ గుబులు

TG: మున్సిపల్ ఎన్నికల్లో BRS అభ్యర్థులకు ‘చపాతీ రోలర్’ గుర్తు గుబులు పుట్టిస్తోంది. ADR పార్టీ అభ్యర్థులకు ఎన్నికల కమిషన్ కేటాయించిన ఆ గుర్తు కారును పోలి ఉందని గులాబీ నేతలు ఆందోళన చెందుతున్నారు. దీంతో గుర్తులపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. సాధారణ ఎన్నికలు, ఉప ఎన్నికల్లోనూ ఇలాంటి గుర్తుల వల్ల ఓట్ల నష్టం జరిగిందని BRS పలుమార్లు ఆందోళన వ్యక్తం చేసింది. వీటిని రద్దు చేయాలని ECని కూడా కోరింది.
News February 5, 2026
పశువుల పాలు పితికిన తర్వాత జాగ్రత్తలు

పాలు పితికిన తర్వాత పశువును అరగంట వరకు నేలపై పడుకోనీయకూడదు. పాలు పితకడం వల్ల పశువుల చనురంధ్రాలు తెరచుకొని ఉంటాయి. అప్పుడు ఆవు/గేదె పడుకుంటే ఆ రంధ్రాల నుంచి బ్యాక్టీరియా త్వరగా పొదుగులో చేరి పొదుగువాపు వ్యాధి వచ్చే అవకాశం ఉంది. ఒక పశువు పాలు తీసిన తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కున్న తర్వాతే మరో పశువు పాలు తీయాలి. దీని వల్ల ఒక పశువుకు ఉన్న అంటువ్యాధులు ఇతర పశువులకు వ్యాపించే ముప్పు తగ్గుతుంది.
News February 5, 2026
సాగునీటి సంఘాల ఛైర్మన్లతో నేడు సీఎం భేటీ

AP: అమరావతి పరేడ్ గ్రౌండ్స్ వేదికగా ఇవాళ సాగునీటి సదస్సు జరగనుంది. రాష్ట్రంలోని 6,047 సంఘాలు, 58 ప్రాజెక్టు కమిటీలు, 267 డిస్ట్రిబ్యూటరీ కమిటీల ఛైర్మన్లు హాజరుకానున్నారు. వారినుద్దేశించి సీఎం చంద్రబాబు ప్రసంగించనున్నారు. ప్రాజెక్టుల యాజమాన్య నిర్వహణ, గ్రామ, మండల, జిల్లా పరిషత్ సమావేశాలకు సాగునీటి సంఘాల ఛైర్మన్లను ప్రత్యేక ఆహ్వానితులుగా పిలవడంపై సీఎం ప్రకటన చేసే అవకాశం ఉంది.


