News October 16, 2024
కృష్ణా: MBA&MCA పరీక్షల నోటిఫికేషన్ విడుదల

కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో MBA&MCA చదివే విద్యార్థులు రాయాల్సిన 1వ సెమిస్టర్(Y20 నుంచి Y23 బ్యాచ్‌లు) థియరీ పరీక్షలను డిసెంబర్ 5 నుంచి నిర్వహిస్తామని వర్సిటీ వర్గాలు తెలిపాయి. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఈ నెల 24లోపు అపరాధరుసుము లేకుండా ఫీజు చెల్లించాలని, వివరాలకు https://kru.ac.in అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని వర్సిటీ తెలిపింది.
Similar News
News November 7, 2025
పాడి పరిశ్రమ అభివృద్ధిలో పశు వైద్యుల పాత్ర ఘనమైనది: కలెక్టర్

పాడి పరిశ్రమ, కోళ్ల పెంపకం అభివృద్ధిలో పశు వైద్యుల పాత్ర ఎంతో ఘనమైనదని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. ప్రజల జీవనోపాదులను మెరుగుపరచడంలో మరింత కృషి చేయాలన్నారు. గురువారం కలెక్టరేట్‌లో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ పశువుల మిషన్-శాస్త్రీయ నిర్వహణ గొర్రెలు, మేకల పెంపకం కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు.
News November 6, 2025
మచిలీపట్నం: ఎన్నికల చట్టాలు, నిబంధనలపై వీడియో కాన్ఫరెన్స్

రాష్ట్రంలోని ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్‌లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎన్నికల చట్టాలు, నియమ నిబంధనలపై ఆన్‌లైన్ సమావేశం నిర్వహించారు. మచిలీపట్నంలోని కలెక్టరేట్‌లో కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ.. అవనిగడ్డ, పామర్రు, పెడన, గన్నవరం నియోజకవర్గాల రెవెన్యూ శాఖేతర అధికారులుగా డీఎస్‌వో, డీఎం పౌరసరఫరాల సంస్థ, బీసీ సంక్షేమ శాఖ అధికారి, ముడా వీసీలు ఓటర్ల నమోదు అధికారులుగా ఉంటారన్నారు.
News November 6, 2025
కృష్ణా: ఇకపై విజన్ యూనిట్‌లుగా సచివాలయాలు

గ్రామ/వార్డు సచివాలయాలు ఇకపై విజన్ యూనిట్‌లుగా మారనున్నాయి. సచివాలయాల పేర్లు మారుస్తున్నట్లు గురువారం జరిగిన మంత్రులు, HODలు, సెక్రటరీల సమావేశంలో సీఎం చంద్రబాబు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో గ్రామ పంచాయతీలకు సమాంతరంగా సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు. జిల్లాలో 508 సచివాలయాలు ఉన్నాయి. ఇకపై ఇవన్నీ విజన్ యూనిట్‌లుగా పని చేయనున్నాయి.


