News October 16, 2024

అన్నక్యాంటీన్ల రంగులపై హైకోర్టులో విచారణ

image

AP: అన్నక్యాంటీన్లకు TDP రంగులు వేస్తున్నారని దాఖలైన పిటిషన్‌‌‌పై హైకోర్టు విచారించింది. గతంలో సచివాలయాలకు బ్లూ కలర్ వేయడంతో వాటిని తొలగించాలని ఇచ్చిన తీర్పును పిటిషనర్ తరఫు లాయర్ కోర్టుకి తెలిపారు. రంగులు తొలగించడానికి సమయం పట్టడంతో కోర్టు ధిక్కరణ పిటిషన్ సైతం దాఖలైందన్నారు. గతంలో క్యాంటీన్లకు ఏ కలర్ వేశారని కోర్టు ప్రశ్నించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసి, విచారణను 6వారాలకు వాయిదా వేసింది.

Similar News

News February 8, 2026

ఏగిలిచేస్తే ఏలనివానికైనా పండుతుంది

image

ఏగిలి చేయడం అంటే పొలాన్ని బాగా దున్నడం, చదును లేదా దమ్ము చేయడం అని అర్థం. ఏలనివానికైనా అంటే ఏమీ తెలియని వాడని అర్థం. సాగు చేయాలనుకునే నేలను బాగా చదును చేసి, దున్ని సరైన సమయంలో విత్తనం వేస్తే, వ్యవసాయం గురించి పెద్దగా అనుభవం లేని వారికైనా సరే పంట బాగా పండుతుంది. అంటే మన కష్టం మరియు నేల సత్తువ మీదే పంట దిగుబడి, ఆదాయం ఆధారపడి ఉంటుందని ఈ సామెత అంతరార్థం.

News February 8, 2026

భాను వ్రతం ఆచరిస్తే.. పాటించాల్సిన నియమాలు

image

సూర్య వ్రతం ఆచరించే వారు సూర్యోదయానికి మేల్కొని, పవిత్ర స్నానం ఆచరించి, సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి. తెలుపు/ఎరుపు రంగు వస్త్రాలు ధరించాలి. పూజా గదిలో సూర్య యంత్రాన్ని, పటాన్ని ఉంచి, ఎర్రటి పూలు, గంధంతో అర్చించాలి. రోజంతా ఉపవాసం ఉండాలి. సాయంత్రం సూర్యాస్తమయానికి ముందు పండ్లు లేదా ఆవు పాలతో చేసిన పరమాన్నాన్ని నైవేద్యంగా స్వీకరించి వ్రతాన్ని ముగించాలి. దీనివల్ల ఆరోగ్యం, తేజస్సు సిద్ధిస్తాయి.

News February 8, 2026

కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన సూర్య కుమార్

image

T20Iల్లో సూర్య కుమార్ యాదవ్ సరికొత్త రికార్డు నెలకొల్పారు. టీమ్ ఇండియా తరఫున అత్యధిక POTMలు నెగ్గిన ప్లేయర్‌గా నిలిచారు. నిన్నటి మ్యాచులో POTM రావడంతో ఆయన ఖాతాలో అవార్డుల సంఖ్య 17కు చేరింది. ఆ తర్వాతి స్థానాల్లో విరాట్ కోహ్లీ(16), రోహిత్ శర్మ(14), అక్షర్ పటేల్(8) ఉన్నారు. T20I WCలో భారత్ తరఫున అత్యధిక POTMలు గెలిచిన జాబితాలో కోహ్లీ(8), సూర్య(4), యువరాజ్(3), అశ్విన్(3), రోహిత్(3) ఉన్నారు.