News October 16, 2024

ప్లాట్ కొనేముందు ఓసారి చెక్ చేసుకోండి!

image

హైడ్రా భయంతో HMDA పరిధిలో ప్లాట్ కొనేందుకు ప్రజలు జంకుతున్నారు. ఈక్రమంలో ధ్రువీకరించిన లేఅవుట్లలోనే ప్లాటు కొనడం శ్రేయస్కరమని రియల్ఎస్టేట్ నిపుణులు సూచిస్తున్నారు. అయితే, మీరు చూస్తున్న లేఅవుట్ అనధికారికంగా ఏర్పాటు చేసిందా? ప్రభుత్వ అనుమతులున్నాయా? అనే విషయాన్ని తెలుసుకోవడం మంచిది. వీటిని <>HMDA తన అధికారిక వెబ్‌సైట్‌<<>>లో ఉంచింది. రంగారెడ్డి, మహబూబ్‌నగర్, మెదక్ పరిధిలోనివి చెక్ చేసుకోండి.

Similar News

News December 31, 2025

పెరుగుతున్న స్క్రబ్ టైఫస్ కేసులు.. 22 మరణాలు

image

APలో <<18469690>>స్క్రబ్ టైఫస్<<>> కేసులు క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు 2 వేలకుపైగా కేసులు నమోదు కాగా 22మంది మరణించారు. గత మూడేళ్లుగా చిత్తూరు(D)లో తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ ఏడాది చిత్తూరులో అత్యధికంగా 491 కేసులు నమోదయ్యాయి. కాకినాడ, విశాఖ జిల్లాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. శరీరంపై నల్లమచ్చతోపాటు జ్వరం, తలనొప్పి ఉంటే వైద్యులను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు.

News December 31, 2025

గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్ ఉన్నాయా?

image

మహిళల గర్భాశయంలో ఏర్పడే గడ్డలనే ఫైబ్రాయిడ్స్ అంటారు. ఇవి రకరకాల పరిమాణాల్లో ఏర్పడతాయి. ఫైబ్రాయిడ్స్‌ ఉన్న మహిళల్లో నెలసరి స్రావంలో రక్తపు గడ్డలు కనిపించడం, నొప్పి లాంటి లక్షణాలు ఉంటాయి. ఒకవేళ ఫైబ్రాయిడ్స్‌ చాలా పెద్దవిగా ఉంటే మూత్రాశయం మీద ఒత్తిడి పడడం మూలంగా మూత్రసంబంధ సమస్యలు వస్తాయి. ✍️ ఫైబ్రాయిడ్స్ గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి <<-se_10014>>వసుధ కేటగిరీ<<>>లోకి వెళ్లండి.

News December 31, 2025

ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు

image

<>ఇంజినీర్స్ <<>>ఇండియా లిమిటెడ్‌లో 42 అసోసియేట్ ఇంజినీర్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి BE/B.Tech/BSc(Engg.) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. స్క్రీనింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. పొజిషన్ కోడ్‌ను బట్టి జనవరి 12, 13, 19, 20, 21, 22, 23, 24తేదీల్లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. వెబ్‌సైట్: https://www.engineersindia.com/careers