News October 16, 2024

నిజాంపట్నం: ‘18 వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదు’

image

భారీ వర్షాల నేపథ్యంలో బాపట్ల జిల్లాలో మత్స్యకారులు ఈ నెల 18 వరకు వేటకు వెళ్లరాదని నిజాంపట్నం మత్స్య శాఖ సహాయ డైరెక్టర్ సైదా నాయక్ తెలిపారు. తీరంలో అలలు, గాలుల ఉద్ధృతి అధికంగా ఉన్న నేపథ్యంలో వేట చేయటం నిషేధించినట్లు చెప్పారు. కావున మత్స్యకారులు మత్స్య శాఖ ఆదేశాలను పాటించి బోటులను, సురక్షిత ప్రాంతాలలో భద్రపరుచుకోవాలని సూచించారు.

Similar News

News December 28, 2025

2025లో గుంటూరు జిల్లాను ఇవి వణికించాయి

image

2025లో గుంటూరు జిల్లా వరుస విపత్తులు, ప్రమాదాలతో అల్లకల్లోలంగా మారింది. తురకపాలెంలో అనుమానాస్పద వ్యాధితో 30మంది మృతి చెందగా, కలరా, డయేరియా వ్యాప్తితో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో 120 మందికిపైగా చికిత్స పొందారు. మోంథా తుఫాను, కృష్ణా వరదలతో వందల గ్రామాలు ప్రభావితమయ్యాయి. రోడ్డు ప్రమాదాల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు. డ్రైనేజీ సమస్యలు, కార్పొరేషన్ విస్తరణపై వివాదాలు ప్రజలను కలవరపెట్టాయి.

News December 28, 2025

148 గ్రంథాల కర్త.. కవి శిఖామణి బెల్లంకొండ

image

ప్రముఖ పండితులు, కవి శిఖామణి బెల్లంకొండ రామరాయ కవీంద్రుడు ఉమ్మడి గుంటూరు జిల్లా పమిడిపాడులో 28 డిసెంబర్ 1875 జన్మించారు. వీరి 39 సంవత్సరాల జీవితంలో సుమారు 148 గ్రంథాలను రచించారు. ఆయన పలు అష్టకములు, స్తుతులు, అష్టోత్తర శతనామ స్తోత్రాలు, సహస్రనామ స్తోత్రాలు, గద్య స్తోత్రాలు, దండకాలు, శతకాలు, కావ్యాలు, వ్యాఖ్యాన, వ్యాకరణ, వేదాంత గ్రంథాలు మొదలైన వాటిని రచించారు.

News December 28, 2025

REWIND 2025: గుంటూరు జిల్లాలో టాప్ 7 కేసులు

image

➤ మంగళగిరిలో రూ.5 కోట్ల బంగారు దోపిడీ కేసు
➤ పట్టాభిపురంలో రూ.35 లక్షల ఇంటి దొంగతనం
➤ మేడికొండూరులో హత్య కేసు
➤ కొల్లిపరలో దంపతులచే చేసిన దొంగతనాలు
➤ తెనాలిలో వృద్ధ మహిళల హత్యలు
➤ తాడేపల్లిలో ఈర్ష్య కారణంగా జరిగిన హత్య కేసు పరిష్కారం
➤ పట్టాభిపురంలో ఆన్‌లైన్ బెట్టింగ్ రాకెట్‌ వంటి సంచలన కేసులను పోలీసులు ఛేదించారు.