News October 16, 2024
జైలులోనే చనిపోయేవాడిని: కేజ్రీవాల్

ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ BJPపై సంచలన ఆరోపణలు చేశారు. తాను జైలులో ఉన్నప్పుడు తనకు ఇన్సులిన్ ఇవ్వడాన్ని అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రపన్నిందన్నారు. ఒకవేళ తనకు సమయానికి ఇన్సులిన్ అందకపోతే తాను జైలులోనే మరణించేవాడినని పేర్కొన్నారు. తాను ఏ తప్పూ చేయకున్నా BJP సర్కార్ తనను అరెస్ట్ చేయించిందని ఆయన ఆరోపించారు.
Similar News
News September 19, 2025
అంతర్గత, బాహ్య పరాన్నజీవులతో కోళ్లకు కలిగే ముప్పు

అంతర్గత పరాన్నజీవుల వల్ల ఏలికపాములు, బద్దెపురుగులు కోళ్లను తరచూ బాధిస్తాయి. ఈ సమస్య నివారణకు వెటర్నరీ నిపుణుల సలహా మేరకు పైపరిజన్, లెవామిసోల్ మందులతో కోళ్లకు అప్పుడప్పుడు డీవార్మింగ్ చేయించాలి. బాహ్యపరాన్న జీవులైన పేలు, గోమారి, నల్లులు కోళ్లకు తీవ్ర అసౌకర్యం కలిగిస్తాయి. కోళ్లపై, షెడ్‌లో ఈ కీటకాలను గుర్తిస్తే వెటర్నరీ నిపుణుల సూచనతో కీటక సంహారక మందులను కోళ్లపై, షెడ్డు లోపల, బయట పిచికారీ చేయాలి.
News September 19, 2025
ఈ నెల 22 నుంచి దసరా సెలవులు: లోకేశ్

AP: దసరా సెలవులపై విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ గుడ్ న్యూస్ చెప్పారు. ఉపాధ్యాయుల కోరిక మేరకు ఈ నెల 22 నుంచి అక్టోబర్ 2 వరకు పండుగ సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించారు. విద్యాశాఖ అధికారులతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నామని ట్వీట్ చేశారు. కాగా అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఈ నెల 24 నుంచి అక్టోబర్ 2 వరకు హాలిడేస్ ఉన్నాయి. తాజాగా మార్చడంతో అదనంగా రెండు రోజులు సెలవులు రానున్నాయి.
News September 19, 2025
3 వారాలు గడిచినా CBI నుంచి నో రిప్లై!

TG: NDSA (నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ) నివేదిక ఆధారంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై దర్యాప్తు చేయాలని రాష్ట్రప్రభుత్వం కోరినా <<17577217>>సీబీఐ<<>> స్పందించట్లేదు. సెప్టెంబర్ 2న రాసిన లేఖకు ఇప్పటివరకు సమాధానం ఇవ్వలేదు. సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ హైదరాబాద్‌ను సందర్శించినా సర్కారుకు ఎలాంటి సమాచారం అందలేదు. కాగా సీబీఐ రిప్లై కోసం ప్రభుత్వం ఎదురు చూస్తోందని ఉన్నతాధికారులు వే2న్యూస్‌తో తెలిపారు.