News October 16, 2024

కొత్త ఫీచర్లను తీసుకొచ్చిన యూట్యూబ్

image

యూట్యూబ్ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. స్లీప్ టైమర్, రీసైజబుల్ మినీ ప్లేయర్, ఫేవరెట్ ప్లే లిస్ట్, బ్యాక్ స్పీడ్ కంట్రోల్ వంటి వాటిని పరిచయం చేసింది. ఈ ఫీచర్లు ఎలా పనిచేస్తాయో స్పష్టంగా వివరించింది. ఒకవేళ యూట్యూబ్ చూస్తూ యూజర్ పడుకున్నా వీడియో పాస్ అయ్యేలా స్లీప్ టైమర్ ఉండనుంది. బ్యాక్ స్పీడ్ 0.25 సెకండ్స్ నుంచి 0.05 సెకండ్స్ చేసుకునేలా వెసులుబాటు కల్పించింది.

Similar News

News October 16, 2024

గ్రూప్-1 నియామకాలపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరణ

image

TG: గ్రూప్-1 నియామక ప్రక్రియపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. గ్రూప్-1 నియామకాల్లో దివ్యాంగుల రిజర్వేషన్ల అంశంపై దాఖలైన పిటిషన్లపై ఇవాళ విచారణ జరిపింది. నియామకాలు తుది తీర్పునకు లోబడి ఉంటాయని ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తిస్థాయి వాదనల కోసం విచారణను నవంబర్ 20కి వాయిదా వేసింది. కాగా ఈనెల 21 నుంచి మెయిన్స్ పరీక్షలున్నాయని, 3 నెలల్లో ఫలితాలు విడుదల చేస్తామని TGPSC కోర్టుకు తెలిపింది.

News October 16, 2024

SRH రిటెన్షన్స్: క్లాసన్‌కు రూ.23 కోట్లు?

image

IPL-2025 వేలానికి ముందు SRH రిటైన్ చేసుకునే ప్లేయర్ల లిస్టును ESPNcricinfo విడుదల చేసింది. క్లాసన్‌కు ₹23 కోట్లు, కమిన్స్‌కు ₹18కోట్లు, అభిషేక్ శర్మకు ₹14కోట్లు వెచ్చించి రిటైన్ చేసుకోవాలని SRH నిర్ణయించిందని పేర్కొంది. హెడ్, నితీశ్ కుమార్ రెడ్డిని కూడా అంటిపెట్టుకోనుందని ఓ ఆర్టికల్‌ను ప్రచురించింది. కాగా ప్లేయర్ల రిటెన్షన్స్‌ను ఫైనల్ చేసేందుకు ఫ్రాంచైజీలకు ఇచ్చిన గడువు ఈనెల 31తో ముగియనుంది.

News October 16, 2024

ALERT: రేపు, ఎల్లుండి ఈ జిల్లాల్లో వర్షాలు

image

తెలంగాణలోని పలు జిల్లాల్లో రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఖమ్మం, వరంగల్, నల్గొండ, మెదక్, నిజామాబాద్, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, మహబూబాబాద్, సూర్యాపేట, మహబూబ్ నగర్, గద్వాల్, నారాయణపేట, వికారాబాద్, JGL, సిరిసిల్ల, HYD, మేడ్చల్, వనపర్తి, నాగర్ కర్నూల్, సంగారెడ్డి, ములుగు, జనగాం, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.