News October 16, 2024

ఎమ్మెల్యేలపై ఫిర్యాదులు.. సీఎం చంద్రబాబు ఆగ్రహం

image

AP: ఉచిత ఇసుక అంశంలో ఫిర్యాదులు రావడంపై CM చంద్రబాబు సీరియస్ అయ్యారు. దీనిపై చర్చించేందుకే ఎల్లుండి పార్టీ సమావేశం నిర్వహిస్తున్నామని క్యాబినెట్ భేటీలో తెలిపారు. ఇసుక అంశంలో MLAల జోక్యంపై వచ్చిన ఫిర్యాదులపై చర్చిస్తామన్నారు. లబ్ధిదారులపై రవాణా ఛార్జీలు తప్ప ఇతర ఛార్జీలు పడకూడదని, ఇసుక తవ్వుకుని తీసుకెళ్తే రుసుము వసూలు చేయొద్దన్నారు. అక్రమాలు జరగకుండా ఇన్‌ఛార్జ్ మంత్రులు చర్యలు తీసుకోవాలన్నారు.

Similar News

News October 16, 2024

HATSOFF: రామ్ చరణ్ మంచి మనసు!

image

చిరంజీవి పుట్టినరోజైన AUG 22న జన్మించిన ఓ పాప పాలిట ప్రాణదాతలా నిలిచారు రామ్‌చరణ్. ‘పల్మనరీ హైపర్‌టెన్షన్’ ఉండటంతో ఆమె బతకదని వైద్యులు చెప్పారు. తల్లిదండ్రులు బిడ్డను ‘అపోలో’కు తీసుకెళ్లారు. రూ.లక్షలు వెచ్చించే స్తోమత వారికి లేదు. విషయం తెలుసుకున్న చెర్రీ ఖర్చంతా భరించి పాపకు వైద్య సాయం అందించారు. ఈరోజు ఆ పసిపాప డిశ్చార్జి అయింది. దీంతో సేవలో తండ్రికి తగ్గ తనయుడని చరణ్‌పై ప్రశంసలు వస్తున్నాయి.

News October 16, 2024

GHMC కమిషనర్‌గా ఇలంబర్తి

image

TG: ఏపీకి అలాట్ చేసిన ఐఏఎస్‌లను <<14375321>>రిలీవ్<<>> చేసిన ప్రభుత్వం వారి స్థానాల్లో సీనియర్లకు అదనపు బాధ్యతలు అప్పగించింది. GHMC కమిషనర్‌గా ఇలంబర్తి, ఎనర్జీ సెక్రటరీగా సందీప్ కుమార్ సుల్తానియా, ఉమెన్స్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సెక్రటరీగా శ్రీదేవి, టూరిజం అండ్ కల్చర్ ప్రిన్సిపల్ సెక్రటరీగా శ్రీధర్, ఆరోగ్య శ్రీ సీఈవోగా ఆర్వీ కర్ణన్‌కు అదనపు బాధ్యతలు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

News October 16, 2024

ఐఏఎస్‌లను రిలీవ్ చేస్తూ TG ప్రభుత్వం ఉత్తర్వులు

image

ఏపీకి కేటాయించిన ఐఏఎస్‌లను రిలీవ్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐఏఎస్ అధికారులు ఆమ్రపాలి, వాకాటి కరుణ, రోనాల్డ్ రాస్, వాణి ప్రసాద్‌ను ఏపీకి అలాట్ చేస్తూ డీవోపీటీ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.