News October 16, 2024
హైదరాబాద్‌లో యువతిపై నల్గొండ జిల్లా వాసి అత్యాచారం

గచ్చిబౌలి PS పరిధిలో సోమవారం అర్ధరాత్రి జరిగిన అత్యాచారం కేసులో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. నల్గొండ జిల్లా కేతిపల్లికి చెందిన ప్రవీణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. సోమవారం RCపురంలో బస్సు దిగిన యువతి(32)నానక్‌రాంగూడకు వెళ్లేందుకు ఆటో ఎక్కింది. ఆమెపై కన్నేసిన డ్రైవర్ HCUసమీపంలోని మసీద్ బండ వద్ద అత్యాచారం చేసి పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదైంది. తాజాగా నిందితుడిని అరెస్ట్ చేశారు.
Similar News
News November 10, 2025
నల్గొండ: రూ.549కే రూ.10 లక్షల బీమా

నల్గొండ డివిజన్ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ద్వారా 18 నుంచి 65 సం.ల వారికి అత్యంత తక్కువ ప్రీమియంతో గ్రూప్ ప్రమాద బీమా పాలసీలను అందుబాటులోకి తెచ్చింది. ప్రమాదంలో మరణం లేదా శాశ్వత వైకల్యం సభవింస్తే కేవలం రూ.549 వార్షిక ప్రీమియంతో రూ.10 లక్షల వరకు కవరేజ్ పొందే విధంగా ప్లాన్ తెచ్చింది. ఈ అవకాశం IPPB ఖాతాదారులకు మాత్రమేనని, వివరాల కోసం పోస్టాఫీసును సంప్రదించాలని అధికారులు కోరారు.
News November 10, 2025
NLG: ఆయకట్టులో జోరుగా వరి కోతలు

నాగార్జునసాగర్ నాన్ ఆయకట్టు, ఆయకట్టు పరిధిలో వరి కోతలు ఊపందుకున్నాయి. ఈ ఏడాది వానకాలం సీజన్‌లో నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 1.26 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. రైతులకు పంటచేతికి వచ్చే సమయంలో ఒక పక్క అకాల వర్షం వెంటాడుతుండగా.. మరో పక్క కూలీలు దొరకక రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. పెద్దవూర, హాలియా, నిడమనూరు మండలాల్లో కూలీల కొరత మరింత ఎక్కువగా ఉంది.
News November 9, 2025
నల్గొండ జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

→ నల్గొండ : హైవే విస్తరణ… అభివృద్ధికి కొత్త మార్గం
→ నల్గొండ : కూరగాయలు కొనేటట్లు లేదు..!
→ నల్గొండ : ఇక్కడి నాయకులంతా అక్కడే…!
→ చిట్యాల : గాంధీ గుడిలో అక్షయపాత్ర గురించి తెలుసా?
→ నల్గొండ : బోగస్ ఓట్లకు చెక్
→ నేరేడుచర్ల : గల్లంతైన చిన్నారి మృతదేహం లభ్యం
→ నార్కట్ పల్లి : చెర్వుగట్టుకి పోటెత్తిన భక్తులు


