News October 16, 2024
KMR: నవోదయ ప్రవేశ పరీక్ష కోసం ఆన్‌లైన్లో దరఖాస్తులు
నిజాంసాగర్ జవహర్ నవోదయ విద్యాలయం లో 2025-26 విద్యా సంవత్సరంలో 9వ తరగతి, 11వ తరగతిలో ఖాళీల భర్తీ కోసం అర్హులైన అభ్యర్థులకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రాజు తెలిపారు. అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని చెప్పారు. ఈనెల 30 వరకు చివరి గడువు ఉందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Similar News
News February 3, 2025
NZB: సెంట్రల్ జైలును సందర్శించిన DG సౌమ్యా మిశ్రా
నిజామాబాద్ సెంట్రల్ జైలులో జైళ్ల శాఖ DG సౌమ్యా మిశ్రా సోమవారం వీవింగ్ యూనిట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఖైదీల దుస్తులు, తువ్వాళ్లు, న్యాప్కిన్లు, బెడ్షీట్లు మొదలైన వాటిని ఉత్పత్తి చేస్తున్నారన్నారు. వీటిని వరంగల్ రేంజ్లోని అన్ని జైళ్లకు పంపిణీ చేస్తామన్నారు. ప్రజలకు కూడా విక్రయిస్తామని వెల్లడించారు.
News February 3, 2025
NZB: వ్యభిచార గృహంపై దాడి
నిజామాబాద్ నగరంలో వ్యభిచార గృహంపై టాస్క్ ఫోర్స్, సీసీఎస్ పోలీసులు సోమవారం దాడి చేసినట్లు తెలిపారు. NZB రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మారుతి నగర్‌లోని ఓ ఇంటిపై పోలీసులు రైడ్ చేశారు. ఈ దాడిలో నిర్వాహకురాలితో పాటు ముగ్గురు బాధిత మహిళలను, ఒక విటుడిని పట్టుకున్నట్లు పోలీసులు వివరించారు. 4 సెల్ ఫోన్లు, రూ.3660 నగదును స్వాధీనం చేసుకుని వారిని రూరల్ పోలీసులకు అప్పగించినట్లు పేర్కొన్నారు.
News February 3, 2025
NZB: ఈవీఎం గోడౌన్‌ను పరిశీలించిన కలెక్టర్
జిల్లా కేంద్రంలోని వినాయకనగర్‌లోని ఈవీఎం గోడౌన్‌ను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సోమవారం సందర్శించారు. సాధారణ పరిశీలన ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయి సందర్శించారు. ఈవీఎం గోడౌన్‌కు వేసిన సీళ్లను పరిశీలించారు. సీసీ టీవీలో బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వీవీ ప్యాట్లు, ఇతర ఎన్నికల సామగ్రిని భద్రపరిచిన తీరును తనిఖీ చేశారు. ఈవీఎం గోడౌన్ వద్ద పోలీసు బందోబస్తు తీరును పరిశీలించారు.