News October 16, 2024
‘మీకు ఓటేశా.. నాకు పెళ్లి చేయండి’.. MLAను కోరిన వ్యక్తి

UPలో చర్ఖారీ MLA బ్రిజ్‌భూషణ్‌కు ఊహించని అనుభవం ఎదురైంది. పెట్రోల్ బంక్‌లో పని చేసే అఖిలేంద్ర అనే వ్యక్తి తనకు పెళ్లి చేయాలని MLAను కోరాడు. తననే ఎందుకు అడుగుతున్నావని MLA ప్రశ్నించగా.. ‘నేను మీకు ఓటేశాను’ అని ఆన్సర్ ఇచ్చాడు. తన వయసు 43 అని చెప్పాడు. కాసేపు మాట్లాడిన MLA ‘నాకు ఓటేశావు కదా. నా వంతు ప్రయత్నిస్తా. నీ జీతం ఎంత?’ అని అడిగారు. అతను రూ.6వేలు వస్తుందని, 13బిగాల భూమి ఉందని చెప్పారు.
Similar News
News March 12, 2025
కేంద్రమంత్రి శ్రీనివాస వర్మకు తప్పిన ప్రమాదం

కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ కారు ఢిల్లీలో ప్రమాదానికి గురైంది. విజయ్ చౌక్ నుంచి ఎయిర్‌పోర్టుకు ఆయన కారులో బయల్దేరగా దారిలో ఓ వాహనాన్ని తప్పించబోయి మంత్రి కారు డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. అదే సమయంలో ఎదురుగా వస్తున్న మరో కారు శ్రీనివాస వర్మ వాహనాన్ని ఢీకొట్టింది. సడన్ బ్రేక్ వేయడంతో మంత్రి తల, కాలుకు గాయాలయ్యాయి. కాలికి బలమైన గాయం కావడంతో విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.
News March 12, 2025
మారనున్న KBC హోస్ట్!

‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ హోస్ట్‌గా చేస్తోన్న బిగ్ బీ అమితాబ్ బచ్చన్ నెక్స్ట్ సీజన్ నుంచి వైదొలిగే అవకాశం ఉందని సినీవర్గాలు తెలిపాయి. దీంతో తర్వాతి హోస్ట్ ఎవరనే చర్చ మొదలైంది. ఆయన స్థానంలో బాలీవుడ్ నటీనటులు షారుఖ్ ఖాన్, ఐశ్వర్య రాయ్, మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీలలో ఒకరిని నియమిస్తారని సమాచారం. 2007 KBCలో షారుఖ్ హోస్ట్‌గా చేసిన విషయం తెలిసిందే. ఎవరిని నియమిస్తే బాగుంటుందో కామెంట్ చేయండి.
News March 12, 2025
క్రికెటర్స్ కమ్ రెస్టారెంట్ ఓనర్స్!

టీమ్ఇండియా తరఫున ఆడిన కొందరు భారత క్రికెటర్లకు సొంతంగా రెస్టారెంట్ బిజినెస్‌లు ఉన్నాయనే విషయం మీకు తెలుసా? స్పోర్ట్స్ థీమ్‌తో కపిల్ దేవ్ ‘ఎలెవన్స్’ రెస్టారెంట్ స్థాపించారు. విరాట్ కోహ్లీ (One8 Commune), రవీంద్ర జడేజా (జడ్డూస్ ఫుడ్ ఫీల్డ్), సురేశ్ రైనా (రైనా), జహీర్ ఖాన్ (డైన్ ఫైన్), శిఖర్ దావన్ (ది ఫ్లైయింగ్ క్యాచ్), స్మృతి మందాన మహారాష్ట్రలోని సంగ్లీలో SM18 కేఫ్ నిర్వహిస్తున్నారు.