News October 16, 2024

నెల్లూరు: రేపు ఉదయం వరకు జాగ్రత్త

image

ఉమ్మడి నెల్లూరు జిల్లాకు మరో ముప్పు ముంచుకొస్తోంది. బంగాళఖాతంలో ఏర్పడిన వాయుగుండం సూళ్లూరుపేట దగ్గరలో గురువారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో తీరం దాటే అవకాశం ఉంది. ఈప్రభావంతో సూళ్లూరుపేట, నాయుడుపేట, గూడూరు, మనుబోలులో గంటకు 40 నుంచి 50 KM వేగంతో గాలులు వీస్తాయి. మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయి. ప్రస్తుతానికి వాయుగుండం నెల్లూరుకు 270 KM దూరంలో ఉండగా.. గంటకు 10 KM వేగంతో తీరం వైపు దూసుకొస్తోంది.

Similar News

News November 11, 2025

ఘోర రోడ్డు ప్రమాదం.. సచివాలయ ఉద్యోగి మృతి

image

నెల్లూరు NTR నగర్ జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో సచివాలయ ఉద్యోగి ముజాహిద్దీన్ అలీ మృతి చెందినట్లు పోలీసులు ధ్రువీకరించారు. ఈయన ద్వారకా నగర్-2 వార్డు సచివాలయంలో శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ కార్యదర్శిగా పని చేస్తున్నారు. ఆయన మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రిలో కమిషనర్ వై.ఓ నందన్ పరిశీలించారు. బైక్‌పై వస్తుండగా లారీ ఢీకొట్టినట్లు అనుమానిస్తున్నారు.

News November 11, 2025

కావలి: వృద్ధురాలిపై అఘాయిత్యానికి యత్నం

image

వృద్ధురాలిపై ఓ వ్యక్తి అఘాయిత్యానికి యత్నించిన ఘటన కావలి మండలంలో జరిగింది. కావలి మండలంలోని ఓ గ్రామానికి చెందిన మనోజ్ ప్రభాకర్ వృద్ధురాలి(75) ఇంట్లోకి వెళ్లి అఘాయిత్యానికి యత్నించాడు. ఆమె కేకలు వేయడంతో అక్కడ నుంచి అతడు పారిపోయాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు దర్యాప్తు చేస్తున్నారు.

News November 11, 2025

తిరుమల లడ్డూ కల్తీ కుట్రదారుల పాపం పండుతోంది: సోమిరెడ్డి

image

తిరుమల లడ్డూ కల్తీ కుట్రదారుల పాపం పండుతోందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. వైసీపీ హయాంలో లీటర్‌కు రూ.20 కమీషన్ తీసుకుని కల్తీ నెయ్యిని సరఫరా చేయించిన విషయం వాస్తవం కాదా అని ఆయన ప్రశ్నించారు. బ్యాంకు ఖాతాలు, లావాదేవీల వివరాలను సిట్ కోరితే వైవీ సుబ్బారెడ్డి కోర్టుకు ఎందుకెళ్లారని ప్రశ్నించారు.