News October 16, 2024

ఉచితంగా ఇసుక తీసుకెళ్లొచ్చు.. అడ్డుకోవద్దు: చంద్రబాబు

image

AP: ఉచిత ఇసుక విషయంలో కూటమి MLAలు జోక్యం చేసుకుంటే ఎవర్నీ వదలబోమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ‘ఇందులో తన, మన అనేవి ఉండవు. ఇసుక ఉచితంగానే తీసుకెళ్లాలి. ఎవరైనా ఎడ్ల బండి తీసుకొచ్చి ఇసుక తీసుకెళ్లవచ్చు. వారిపై కేసులు పెడితే అధికారులను సస్పెండ్ చేస్తాం. దీనిలో ఎవరి పెత్తనాన్నీ సహించం. ఎవరి ఊరిలో వాళ్లకు ఇసుక తీసుకెళ్లే స్వేచ్ఛ ఉంటుంది. ఇందులో ఎవరి పెత్తనం వద్దు’ అని ఆయన స్పష్టం చేశారు.

Similar News

News January 17, 2026

గ్లోబల్ ర్యాంకింగ్స్‌లో హార్వర్డ్ డౌన్

image

2025 గ్లోబల్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో హార్వర్డ్ యూనివర్సిటీ మూడో స్థానానికి పడిపోయింది. నెదర్లాండ్స్‌కు చెందిన సెంటర్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ స్టడీస్ విడుదల చేసిన జాబితాలో చైనా విశ్వవిద్యాలయాలే ఎక్కువగా ఉన్నాయి. జెజియాంగ్ వర్సిటీ తొలి స్థానం, షాంఘై జియావో రెండో స్థానంలో నిలిచాయి. టాప్ 10లో 8 వర్సిటీలు చైనావే కావడం విశేషం. భారత విశ్వవిద్యాలయాలు టాప్ 100లో చోటు దక్కించుకోలేకపోయాయి.

News January 17, 2026

ముక్కనుమ రోజు మాంసాహారం తినవచ్చా?

image

భోగి, సంక్రాంతి, కనుమ పండుగల్లో శాకాహారానికే ప్రాధాన్యతనిచ్చే ప్రజలు నాలుగో రోజైన ముక్కనుమ నాడు మాంసాహారాన్ని ఇష్టంగా వండుకుంటారు. అందుకే దీనిని వాడుక భాషలో ముక్కల పండుగ అని పిలుస్తారు. ఈ రోజున గ్రామ దేవతలకు నైవేద్యాలు సమర్పించి, ఆపై బంధుమిత్రులతో కలిసి విందు భోజనాలు చేయడం తరతరాలుగా వస్తున్న ఆచారం. శాస్త్రపరంగా దీనికి అభ్యంతరం లేదు కాబట్టి, పల్లెల్లో ప్రతి ఇంటా ముక్కనుమ విందు ఘనంగా జరుగుతుంది.

News January 17, 2026

రూ.13 వేల కోట్ల ప్రాజెక్ట్.. నేడే శంకుస్థాపన

image

AP: రాష్ట్రంలో రూ.13,000 కోట్ల పెట్టుబడితో 495 ఎకరాల్లో కాకినాడలో గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ ఏర్పాటు కానుంది. ఈ ప్రాజెక్టుకి నేడు CM చంద్రబాబు, Dy.CM పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్లాంట్‌ ద్వారా 2,600 మందికి ఉపాధి దక్కనుంది. దీనిని AM గ్రీన్ సంస్థ ఏర్పాటు చేస్తుండగా ఏడాదికి 1 మిలియన్ మెట్రిక్ టన్ను గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి కానుంది.