News October 17, 2024
కృష్ణా జిల్లా నేటి ముఖ్యాంశాలు

* NTR జిల్లా జనసేన అధ్యక్షుడిగా సామినేని ఉదయభాను
* పోరంకి: వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజీ సీఎం జగన్
* మచిలీపట్నంలో 74వ నంబర్ రేషన్ షాప్ సీజ్
* విజయవాడలో కూలిన ప్రహరీ.. కార్లు ధ్వంసం
* రేపు ఇంద్రకీలాద్రిపై గిరిప్రదక్షిణ
* జగ్గయ్యపేట: పలువురు వైసీపీ నుంచి జనసేనలోకి..
* గుడివాడలో ఆస్పత్రిని తనిఖీ చేసిన MLA రాము
* మంత్రి లోకేశ్‌కు జగ్గయ్యపేట తల్లిదండ్రుల కృతజ్ఞతలు
Similar News
News May 7, 2025
గన్నవరం విమానాశ్రయంలో మోదీ పర్యటనపై సమీక్ష

అమరావతి రాజధాని ప్రాంతంలో ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ఏర్పాట్లు, భద్రతా అంశాలపై గన్నవరం విమానశ్రయంలో ప్రభుత్వ విభాగాల అధికారులు, విమానశ్రయ అధికారులతో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర నోడల్ అధికారి వీరపాండ్యన్, కలెక్టర్ డీ.కే బాలాజీ, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, S.P గంగాధర రావు, విమానశ్రయ డైరక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.
News April 25, 2025
తేలప్రోలు: కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు

హౌరా-చెన్నై మధ్య నడిచే కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌లో కార్గో బోగి రైల్వే చక్రాలు దగ్గర మంటలు చెలరేగాయి. శుక్రవారం ఉదయం తేలప్రోలు దగ్గర మంటలు రావడంతో లోకో పైలట్ అప్రమత్తమై ట్రైన్‌ను నిలిపివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. తేలప్రోలు రైల్వే స్టేషన్ దాటిన తర్వాత ఈ ఘటన జరిగింది. లోకో పైలట్ మంటలను ఆర్పి వేశారు.
News April 25, 2025
కృష్ణా: ఈ ప్రాంతాల ప్రజలు జాగ్రత్త.!

జిల్లాలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండనున్నట్లు APSDMA తెలిపింది. శుక్రవారం ఉష్ణోగ్రతలు అధికంగా ఉండే ప్రాంతాలను వెల్లడించింది. బాపులపాడు 40.8°, గన్నవరం 41.2°, గుడివాడ 40.2°, కంకిపాడు 40.7°, నందివాడ 40.1°, పెనమలూరు 40.9°, ఉంగుటూరు 40.9°, పెదపారుపూడి 40.3°, తోట్లవల్లూరు 40°, ఉయ్యూరు 40.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంటాయని తెలిపింది. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.