News October 17, 2024
బీసీలకు కవచం బీసీ రక్షణ చట్టం: మంత్రి సవిత

రాష్ట్రంలో వెనుకబడిన తరగతులకు గౌరవప్రదమైన జీవనం అందించడమే లక్ష్యంగా బీసీ రక్షణ చట్టం రూపొందిస్తున్నట్లు మంత్రి సవిత స్పష్టం చేశారు. బుధవారం అమరావతిలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ చట్టం రాష్ట్రంలో వెనుకబడిన తరగతులకు రక్షణ కవచంలాంటిదన్నారు. సీఎం చంద్రబాబు గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు కట్టుబడి బీసీ డిక్లరేషన్‌లో పేర్కొన్న అంశాలను అమలు చేయడానికి కృతనిశ్చయంతో ఉన్నారని తెలిపారు.
Similar News
News July 7, 2025
‘రాష్ట్రంలో అనంత జిల్లా మొదటి స్థానంలో నిలవాలి’

మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ 2.0ని రికార్డ్ సృష్టించేలా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఆదివారం కలెక్టరేట్ క్యాంప్ కార్యాలయం నుంచి పేరెంట్ టీచర్స్ మీటింగ్‌పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈనెల 10న సత్య సాయి జిల్లాలో జరిగే మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్‌కి సీఎం చంద్రబాబు పాల్గొనే అవకాశం ఉందన్నారు.
News July 7, 2025
పామిడి: ‘నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక’

పామిడి మండల కేంద్రంలోని పద్మావతి కన్వెన్షన్ హాల్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ చెప్పారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో అందజేయాలన్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహిస్తామన్నారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News July 6, 2025