News October 17, 2024
VZM: ‘జిల్లా వ్యాప్తంగా శానిటేషన్ స్పెషల్ డ్రైవ్’

జిల్లా వ్యాప్తంగా గురువారం నుంచి ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆదేశించారు. అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎక్కడా పారిశుద్ధ్య సమస్య రాకూడదని ఆయన స్పష్టం చేశారు. గ్రామాల్లో ఇంటింటి సర్వే నిర్వహించి పరిస్థితిని తెలుసుకోవాలని సూచించారు. గుర్ల డయేరియా ఘటనలు ఎక్కడా పునరావృతం కాకూడదని స్పష్టం చేశారు.
Similar News
News September 18, 2025
పూసపాటిరేగ: వేటకు వెళ్లి మృతి

పూసపాటిరేగ మండలం పెద్దూరుకు చెందిన ఓ మత్స్యకారుడు వేటకు వెళ్లి మృతి చెందాడు. ఈ ఘటనపై స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మత్స్యకారుడైన బి.రాము బుధవారం వేటకు వెళ్లగా.. చేపల కోసం వల వేసే క్రమంలో జారి పడిపోయాడు. అక్కడున్నవారు కాపాడే ప్రయత్నం చేసినా ఫలించలేదు. ఈ ఘటనపై మెరైన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News September 17, 2025
ఈనెల 19న ఉద్యోగుల కోసం గ్రీవెన్స్: కలెక్టర్

ఈ నెల 19వ తేదీ శుక్రవారం ఉద్యోగుల కోసం ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డి బుధవారం తెలిపారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో ఈ కార్యక్రమంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొంటారని వెల్లడించారు. ఉద్యోగులు తమ సమస్యలపై ఈ గ్రీవెన్స్‌లో ధరఖాస్తులను అందజేయవచ్చునని సూచించారు. ప్రతి 3వ శుక్రవారం కార్యక్రమం జరుగుతుందన్నారు.
News September 17, 2025
VZM: సిరిమాను చెట్టుకు బొట్టు పెట్టే కార్యక్రమం

విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమాను, ఇరుసు చెట్లకు వేదపండితుల మంత్రోచ్చరణల నడుమ బుధవారం శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. గంట్యాడ (M) కొండతామరపల్లిలోని చల్ల అప్పలనాయుడు కల్లంలో గుర్తించిన ఈ చెట్లకు ఉదయం 9.15 గంటలకు బొట్టు పెట్టే కార్యక్రమం సాంప్రదాయబద్ధంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పూజారి బంటుపల్లి వెంకటరావు, ఈవో శిరీష, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాస్, ప్రెసిడెంట్ భాస్కర్, భక్తులు పాల్గొన్నారు.