News October 17, 2024
LLC ఛాంపియన్గా సదరన్ సూపర్స్టార్స్

ఛాంపియన్స్ లీగ్ క్రికెట్ 2024 విజేతగా సదరన్ సూపర్స్టార్స్ నిలిచింది. కోనార్క్ సూర్యాస్తో జరిగిన ఫైనల్లో ఈ జట్టు సూపర్ ఓవర్లో విజయం సాధించింది. సదరన్ తొలుత 164/6 పరుగులు చేసింది. ఛేదనలో కోనార్క్ కూడా సరిగ్గా అన్నే పరుగులు చేసింది. యూసుఫ్ పఠాన్ (38 బంతుల్లో 85) ఊచకోత కోసినా జట్టు విజయం సాధించలేకపోయింది. దీంతో సూపర్ ఓవర్ ఆడించగా సదరన్ గెలుపొందింది.
Similar News
News September 15, 2025
బాక్సాఫీస్ వద్ద ‘మిరాయ్’ కలెక్షన్ల సునామీ

తేజా సజ్జ హీరోగా కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ‘మిరాయ్’ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ చిత్రం మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.81.20 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు మేకర్స్ తెలిపారు. మంచు మనోజ్ కీ రోల్ చేయగా, రితికా నాయక్ హీరోయిన్గా నటించారు. తొలి రోజు రూ.27.2 కోట్లు రాగా, రెండో రోజు రూ.28.4కోట్లు, మూడో రోజు 25.6 కోట్లు వచ్చాయి.
News September 15, 2025
శివుడికి మూడో నేత్రం ఎలా వచ్చింది? (1/2)

శివుడు త్రినేత్రుడు. మరి ఆయనకు మూడో నేత్రం ఎలా వచ్చిందో మీకు తెలుసా? ‘శివుడు ఒకనాడు ధ్యానంలో ఉండగా పార్వతీ దీవి సరదాగా వెళ్లి ఆయన కళ్లు మూసింది. దీంతో లోకమంతా చీకటి ఆవహించింది. అప్పుడు శివుడు తన శక్తులను ఏకం చేసి నుదుటిపై మూడవ నేత్రాన్ని ఆవిష్కరించి, తెరిచాడు. లోకాన్ని వెలుగుతో నింపాడు’ అని పండితులు చెబుతున్నారు. ఈశ్వరుడి త్రినేత్రానికి సంబంధించి మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది.
News September 15, 2025
శివుడికి మూడో నేత్రం ఎలా వచ్చింది? (2/2)

సృష్టికి మూలమైన ఆదిపరాశక్తి త్రిమూర్తులను సృష్టించింది. సృష్టి, స్థితి, లయ కారకులుగా ఉండమని వారిని కోరింది. కానీ వారు నిరాకరించారు. దీంతో ఆమె తన మూడో నేత్రంతో వారిని భస్మం చేస్తానని చెప్పింది. అప్పుడు శివుడు ఆ నేత్రాన్ని తనకు ఇవ్వమని కోరాడు. ఆయన ప్రార్థనను మన్నించిన ఆమె ఆ కంటిని ప్రసాదించింది. శివుడు ఆ నేత్రంతో ఆమెను భస్మం చేసి, దాన్ని 3 భాగాలుగా విభజించి లక్ష్మి, సరస్వతి, పార్వతులను సృష్టించాడు.