News October 17, 2024

ఎలక్షన్ కమిషనర్‌కు తప్పిన పెను ప్రమాదం

image

కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి రాజీవ్ కుమార్‌కు పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఉత్తరాఖండ్‌లో అత్యవసర ల్యాండింగ్ అయ్యింది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏర్పడటంతో పైలట్ పిథోరాగఢ్ జిల్లాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. హెలికాప్టర్‌లో ఉన్నవారంతా క్షేమంగా బయటపడ్డారు.

Similar News

News October 17, 2024

ఇళ్లలోకి సముద్ర జలాలు.. భయాందోళనలో ప్రజలు

image

AP: వాయుగుండం ప్రభావంతో కాకినాడ(D) ఉప్పాడ తీరం అల్లకల్లోలంగా మారింది. భారీగా ఎగసిపడుతున్న రాకాసి అలలు, ఈదురుగాలుల ధాటికి పలు ఇళ్లు, విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకూలాయి. పలు ఇళ్లలోకి సముద్ర జలాలు చేరాయి. దీంతో ప్రజలు భయాందోళనలో ఉన్నారు. ప్రస్తుతం గంటకు 17KM వేగంతో వాయుగుండం కదులుతోంది. మరికొన్ని గంటల్లో పుదుచ్చేరి-నెల్లూరు మధ్య తీరం దాటనుంది. దీనిప్రభావంతో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి.

News October 17, 2024

‘హైడ్రా’కు మరిన్ని పవర్స్: రంగనాథ్

image

TG: హైడ్రాకు విశేష అధికారాలు వచ్చాయని, ఇక నుంచి చెరువులతో పాటు పార్కులు, ప్రభుత్వ స్థలాలు, రోడ్లను పరిరక్షిస్తుందని కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు నోటీసులివ్వడం, వాటిని తొలగించడం, అనధికార భవనాలను సీజ్ చేయడం వంటి అధికారాలు వచ్చాయని పేర్కొన్నారు. ఈ మేరకు GHMC చట్టంలోని సెక్షన్ 374 (B)ని హైడ్రా అధికారాలుగా చేరుస్తూ ప్రభుత్వం గెజిట్ విడుదల చేసిందన్నారు.

News October 17, 2024

HEAVY RAINS: హోటళ్లకు వెళ్తున్న ధనవంతులు

image

చెన్నైలో అత్యంత భారీ వర్షాలు కురుస్తుండటంతో ముందు జాగ్రత్తగా ధనవంతులు హోటళ్లకు వెళ్లిపోతున్నారు. గతేడాది భారీ వరదలతో ఇబ్బందులు పడడంతో ఈసారి ఆ సమస్య లేకుండా ముందే ఖాళీ చేసి వెళ్తున్నారు. కార్ పార్కింగ్, విద్యుత్, వైఫై సౌకర్యాలు ఉన్న విలాసవంతమైన హోటళ్లలో దిగుతున్నారు. మరోవైపు వాతావరణ శాఖ గురువారం అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. సాధారణ ప్రజలు ఎక్కడికీ వెళ్లలేక బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.