News October 17, 2024

1.5 మిలియన్ డాలర్లకు అమ్ముడైన ‘GOT’ సింహాసనం

image

గేమ్ ఆఫ్ థ్రోన్స్(GOT) సిరీస్ చూసిన వారికి అందులోని కత్తులతో కూడిన ఐరన్ థ్రోన్ ఎంత కీలకమో తెలిసే ఉంటుంది. ఆ షో అంతా సింహాసనంపై ఆధిపత్యం కోసమే సాగుతుంది. ఐరన్ థ్రోన్‌కు ఉన్న ఫ్యాన్స్ సంఖ్య తక్కువేం కాదు. ఈ నేపథ్యంలో దానికి ఇటీవల నిర్వహించిన వేలంలో ఓ అజ్ఞాత వ్యక్తి ఏకంగా 1.5 మిలియన్ డాలర్లకు దక్కించుకున్నాడు. వేలం సంస్థ హెరిటేజ్ ఆక్షన్స్ ఈ విషయాన్ని వెల్లడించింది.

Similar News

News October 17, 2024

మోదీ బ్రాండ్ వాషింగ్ మెషీన్.. అవినీతి మటు మాయం: ఏపీ కాంగ్రెస్

image

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో సీఎం చంద్రబాబుకు ఈడీ క్లీన్‌చిట్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఏపీ కాంగ్రెస్ సెటైర్లు వేసింది. ‘2023లో చంద్రబాబుపై స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసు. 2024లో బీజేపీతో పొత్తు. 2024లో బాబుకు క్లీన్‌చిట్. మోదీ బ్రాండ్ వాషింగ్ మెషీన్. అవినీతి మటు మాయం’ అని ట్వీట్ చేసింది. చంద్రబాబు వాషింగ్ మెషీన్ నుంచి బయటకు వస్తున్నట్లు ఉన్న ఫొటోను షేర్ చేసింది.

News October 17, 2024

హైదరాబాద్‌లో ఐటీ రైడ్స్.. బొప్పరాజు ఇళ్లలో తనిఖీలు

image

TG: హైదరాబాద్‌లోని కొల్లూరు, రాయదుర్గంలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. 30 చోట్ల ఏకకాలంలో దాడులు జరుగుతున్నాయి. గూగి ప్రాపర్టీస్ అండ్ డెవలపర్స్, అన్విత బిల్డర్స్ కార్యాలయాల్లో తనిఖీలు చేస్తున్నారు. బొప్పరాజు అచ్యుతరావు, శ్రీనివాసరావు, అనూప్ రావు ఇళ్లతో పాటు విజయవాడకు చెందిన రియల్టర్ల ఇళ్లలో సోదాలు చేస్తున్నారు.

News October 17, 2024

ఆలస్యంగా నిద్ర లేస్తున్నారా?

image

త్వరగా నిద్ర లేచే వారి కంటే ఆలస్యంగా మేల్కొనే వారిలోనే తెలివితేటలు, జ్ఞాపకశక్తి, ఐక్యూ ఎక్కువగా ఉన్నట్లు లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. 26 వేల మంది అమ్మాయిలపై వారు స్టడీ చేశారు. త్వరగా నిద్ర నుంచి మేల్కొనే వారి కంటే ఆలస్యంగా మేల్కొన్న వారే పనులు సమర్థవంతంగా చేయగలుగుతున్నారని వెల్లడించింది. త్వరగా లేవాలనే ఉద్దేశంతో చాలీచాలని నిద్రపోవడం మంచిది కాదని పేర్కొంది.