News October 17, 2024

IND vs NZ : నేడైనా వరుణుడు కరుణించేనా!

image

భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు తొలి రోజు ఆట టాస్ కూడా పడకుండానే రద్దు అయ్యింది. ఇవాళ కూడా బెంగళూరులో వర్షం పడే సూచనలు ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ వరుణుడు కరుణిస్తే మ్యాచ్ జరిగే అవకాశం ఉంది. మరోవైపు ఇవాళ 15 నిమిషాల ముందే ఆట ప్రారంభించాలని అంపైర్లు నిర్ణయించారు. ఉదయం 9.15 గంటల నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు కొనసాగనుంది.

Similar News

News October 17, 2024

అనర్హుల ఏరివేత.. జనవరిలో కొత్త పెన్షన్లు!

image

AP: కొత్త పెన్షన్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. నవంబరులో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో అనర్హుల ఏరివేత కార్యక్రమం చేపట్టనుంది. అనర్హులకు నోటీసులిచ్చి తొలగించేందుకు 45 రోజుల సమయం తీసుకుంటారు. ఈ ప్రక్రియ విధివిధానాల కోసం 8 మంది మంత్రులతో కమిటీ ఏర్పాటు కానుంది. జనవరిలో నిర్వహించే జన్మభూమి-2 ద్వారా కొత్తవారికి మంజూరు పత్రాలు అందించేలా ప్లాన్ చేస్తున్నారు.

News October 17, 2024

‘విదేశీ విద్యానిధి’ గడువు పెంపు

image

TG: విదేశీ విద్యానిధి పథకం ఆన్‌లైన్ దరఖాస్తుల గడువు తేదీని పెంచినట్లు ఎస్సీ అభివృద్ధి శాఖ ఉప సంచాలకులు పెరిక యాదయ్య తెలిపారు. ఈ నెల 29 వరకు గడువు పొడిగించినట్లు వెల్లడించారు. అర్హులైన ఎస్సీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. మరిన్ని వివరాలకు https://telanganaepass.cgg.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.

News October 17, 2024

విమానాలకు బాంబు బెదిరింపులు.. ఓ మైనర్ నిర్వాకం!

image

కొద్ది రోజులుగా విమానాలకు వస్తున్న బాంబు బెదిరింపులు కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన ముంబై పోలీసులు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ మైనర్(17)ను అదుపులోకి తీసుకున్నారు. తన స్నేహితుడిని ఇబ్బంది పెట్టేందుకే ఇలా చేసినట్లు చెప్పడంతో అధికారులు విస్తుపోయారు. డబ్బు విషయంలో ఫ్రెండ్‌తో గొడవ కావడంతో అతని పేరుతో Xలో అకౌంట్ క్రియేట్ చేసి బాంబు బెదిరింపు పోస్టులు చేశాడని పోలీసులు తెలిపారు.