News October 17, 2024

గ్రూప్-1 అభ్యర్థులను కలుస్తా: కేటీఆర్

image

TG: ఒక్క ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని కాంగ్రెస్ మోసం చేసిందని కేటీఆర్ విమర్శించారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను రద్దు చేయాలంటూ ఆందోళన చేస్తున్న అభ్యర్థులకు ఆయన మద్దతు తెలిపారు. ఇవాళ HYDలోని అశోక్ నగర్ లేదా తెలంగాణ భవన్‌లో వారిని కలుస్తానని ట్వీట్ చేశారు. మెయిన్స్ పరీక్షలను రీషెడ్యూల్ చేయాలని, అరెస్టు చేసిన అభ్యర్థులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Similar News

News October 17, 2024

SRHకు డేల్ స్టెయిన్ గుడ్‌బై

image

ఐపీఎల్‌-2025కు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ టీమ్ బౌలింగ్ కోచ్ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు సౌతాఫ్రికా లెజెండ్ డేల్ స్టెయిన్ సోషల్ మీడియాలో ప్రకటించారు. కొన్నేళ్లుగా తనకు అవకాశం కల్పించిన మేనేజ్‌మెంట్‌కు ధన్యవాదాలు తెలిపారు. SA20లో సన్‌రైజర్స్ ఈస్ట్రన్ కేప్‌తో కలిసి పనిచేస్తానని చెప్పారు. వరుసగా మూడోసారి ట్రోఫీ సాధించేందుకు కృషి చేస్తానన్నారు.

News October 17, 2024

6Gలో భారత్‌ అగ్రగామిగా నిలిచేలా..!

image

IIT మద్రాస్‌ టెలికమ్యూనికేషన్ ల్యాండ్‌స్కేప్‌లో విప్లవాత్మక మార్పులు చేసే దిశగా అడుగులు వేస్తోంది. 6G ట్రయల్స్ కోసం టెస్ట్ బెడ్ యూనిట్‌ను ప్రారంభించింది. ఇందులో 6397MBPS ఇంటర్నెట్ స్పీడ్‌తో టెస్టింగ్ దశలో ఉన్న ఓ ఫొటో వైరలవుతోంది. 2030 నాటికి 6G టెక్నాలజీలో భారతదేశాన్ని అగ్రగామిగా మార్చాలనే లక్ష్యంతో పనిచేస్తోంది. భారత్ 6G విజన్‌ స్తోమత, సుస్థిరత, సర్వవ్యాప్తి అనే మూడు సూత్రాలతో పనిచేస్తోంది.

News October 17, 2024

మావోలకు మరో ఎదురుదెబ్బ.. కీలక నేత అరెస్ట్

image

మావోయిస్టు కీలక నేత సుజాతను పోలీసులు పట్టుకున్నారు. చికిత్స కోసం కొత్తగూడెంలోని ఆస్పత్రికి వెళ్తుండగా తెలంగాణ పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. మావోయిస్టుల ఆపరేషన్లలో కీలక పాత్ర పోషించిన సుజాతపై MH, ఏపీ, TG, ఛత్తీస్‌గఢ్‌లో రూ.కోటికిపైగా రివార్డు ఉంది. ప్రస్తుతం ఆమె బస్తర్ డివిజనల్ కమిటీకి ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు. కాగా ఇటీవల జరిగిన భారీ ఎన్‌‌కౌంటర్‌లో 31 మంది మావోలు మృతి చెందిన సంగతి తెలిసిందే.