News October 17, 2024
VZM: 29 నుంచి వైద్యసేవ క్షేత్ర సిబ్బంది సమ్మె

డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవ పథకంలో పనిచేస్తున్న క్షేత్ర సిబ్బంది సమస్యలు 17 ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోవడం లేదని ఏపీ వైద్యమిత్ర ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు జె.ప్రదీప్ ఆవేదన వ్యక్తం చేశారు. తమ డిమాండ్లపై ఉన్నతాధికారులకు ఇప్పటికే వినతిపత్రం అందజేశామని, ఈ నెల 29న రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలోకి వెళుతున్నట్లు తెలిపారు.
Similar News
News February 28, 2026
జిల్లాలో 15 శాతం వృద్ధి రేటు సాధించే దిశగా ప్రణాళికలు: కలెక్టర్

విజయనగరం జిల్లాలో 15% వృద్ధి రేటు సాధించే దిశగా ప్రణాళికలు రూపొందించామని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. రావివలసలో నిర్వహించిన ప్రజావేదికలో ఆయన మాట్లాడారు. 3,280 ఎకరాల్లో ఉద్యాన సాగు విస్తరణ జరిగిందని, రబీ-ఖరీఫ్‌లలో మరింత సాగు పెంపు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. విశాఖ ఎకనమిక్ రీజియన్‌లో భాగంగా ఫుడ్ పార్కులు, ఐటీ పార్కులు, ఎంఎస్‌ఎంఈ పార్కుల కోసం భూములు గుర్తించినట్లు వివరించారు.
News February 28, 2026
సీఎం పర్యటన విజయవంతం: VZM కలెక్టర్

సీఎం చంద్రబాబు జిల్లా పర్యటన ఘనంగా.. విజయవంతంగా ముగిసిందని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రజాప్రతినిధులు, జేసీ సేధు మాధవన్, జిల్లా యంత్రాంగం, పోలీసు శాఖ, వివిధ శాఖల అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తక్కువ సమయంలో సమన్వయంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ఎటువంటి అసౌకర్యం లేకుండా పర్యటనను నిర్వహించామని పేర్కొన్నారు.
News February 28, 2026
రౌడీల్లారా.. రాష్ట్రాన్ని విడిచి పలాయనం చేయండి: సీఎం

అలర్లు, దౌర్జన్యాలు, రౌడీయిజంతో బతికేద్దామనుకున్నవారు తక్షణమే రాష్ట్రాన్ని విడిచి పారిపోవాలని సీఎం చంద్రబాబు శనివారం జరిగిన రావివలస సభలో హెచ్చరించారు. మత్తులో తప్పు చేసే గంజాయి మూకలను చిత్తు చేస్తామన్నారు. ఆడబిడ్డల జోలికొస్తే ఖబడ్దార్ అని చంద్రబాబు తీవ్ర స్వరంతో హెచ్చరించారు. చెడు దారిలో వెళుతున్న వారి పట్ల కఠినంగా వ్యవహరించి దారిలో పెడతామని స్పష్టం చేశారు.


