News October 17, 2024

‘హైడ్రా’కు మరిన్ని పవర్స్: రంగనాథ్

image

TG: హైడ్రాకు విశేష అధికారాలు వచ్చాయని, ఇక నుంచి చెరువులతో పాటు పార్కులు, ప్రభుత్వ స్థలాలు, రోడ్లను పరిరక్షిస్తుందని కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు నోటీసులివ్వడం, వాటిని తొలగించడం, అనధికార భవనాలను సీజ్ చేయడం వంటి అధికారాలు వచ్చాయని పేర్కొన్నారు. ఈ మేరకు GHMC చట్టంలోని సెక్షన్ 374 (B)ని హైడ్రా అధికారాలుగా చేరుస్తూ ప్రభుత్వం గెజిట్ విడుదల చేసిందన్నారు.

Similar News

News October 17, 2024

మావోలకు మరో ఎదురుదెబ్బ.. కీలక నేత అరెస్ట్

image

మావోయిస్టు కీలక నేత సుజాతను పోలీసులు పట్టుకున్నారు. చికిత్స కోసం కొత్తగూడెంలోని ఆస్పత్రికి వెళ్తుండగా తెలంగాణ పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. మావోయిస్టుల ఆపరేషన్లలో కీలక పాత్ర పోషించిన సుజాతపై MH, ఏపీ, TG, ఛత్తీస్‌గఢ్‌లో రూ.కోటికిపైగా రివార్డు ఉంది. ప్రస్తుతం ఆమె బస్తర్ డివిజనల్ కమిటీకి ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు. కాగా ఇటీవల జరిగిన భారీ ఎన్‌‌కౌంటర్‌లో 31 మంది మావోలు మృతి చెందిన సంగతి తెలిసిందే.

News October 17, 2024

దారుణం.. రసాయనాలతో మిల్క్ తయారీ

image

TG: కాదేదీ కల్తీకి అనర్హం అన్నట్లుగా అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. పాల పొడి, ఎసిడిక్ యాసిడ్, గ్లూకోజ్, వనస్పతి, ఇతర రసాయనాలతో నకిలీ పాలను తయారుచేస్తున్నారు. HYD శివారు పీర్జాదిగూడలో ఈ ఉదంతం బయటపడింది. కోహినూర్, శ్రీకృష్ణ బ్రాండ్ల పేరిట కల్తీ పాలు, పెరుగు, ఐస్‌క్రీంలను స్వచ్ఛ భారత్, మేకిన్ ఇండియా లోగోలు వేసి విక్రయిస్తున్నారు. వీటిని ఉపయోగించడం వల్ల ఆరోగ్యానికి హానికరమని నిపుణులు చెబుతున్నారు.

News October 17, 2024

అరుదైన దోమకాటు.. USలో వ్యక్తి మృతి

image

USలో దోమకాటుతో ఈస్టర్న్ ఈక్విన్ ఎన్‌సెఫాలిటిస్(EEE) అనే వ్యాధి బారిన పడి రిచర్డ్(49) అనే వ్యక్తి మరణించాడు. 2019లో ఈ కాటుకు గురవగా ఆస్పత్రిలో ఐదేళ్ల పోరాటం తర్వాత చనిపోయాడు. EEE సోకిన దోమ కుట్టడం వల్ల ఈ వ్యాధి వ్యాపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. జ్వరం, మైగ్రేన్, వాంతులు, విరేచనాలు, మూర్ఛ దీని లక్షణాలు. ఇది సోకిన వారిలో 30% మంది మరణిస్తారు. మిగిలిన వారు నాడీ సంబంధిత సమస్యలతో ఇబ్బందులు పడతారు.