News October 17, 2024

ఇళ్లలోకి సముద్ర జలాలు.. భయాందోళనలో ప్రజలు

image

AP: వాయుగుండం ప్రభావంతో కాకినాడ(D) ఉప్పాడ తీరం అల్లకల్లోలంగా మారింది. భారీగా ఎగసిపడుతున్న రాకాసి అలలు, ఈదురుగాలుల ధాటికి పలు ఇళ్లు, విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకూలాయి. పలు ఇళ్లలోకి సముద్ర జలాలు చేరాయి. దీంతో ప్రజలు భయాందోళనలో ఉన్నారు. ప్రస్తుతం గంటకు 17KM వేగంతో వాయుగుండం కదులుతోంది. మరికొన్ని గంటల్లో పుదుచ్చేరి-నెల్లూరు మధ్య తీరం దాటనుంది. దీనిప్రభావంతో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Similar News

News October 17, 2024

IPL: రోహిత్ శర్మ ఏ టీమ్ అంటే?

image

ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మను రిటైన్ చేసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అక్టోబర్ 31లోగా ఫ్రాంఛైజీలు రిటైన్ చేసుకున్న ప్లేయర్ల లిస్టును బీసీసీఐకి సమర్పించాల్సి ఉంది. ముంబై రోహిత్, హార్దిక్, బుమ్రా, సూర్యలను రిటైన్ చేసుకోవచ్చని ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ తెలిపింది. ఇదే జరిగితే రోహిత్ శర్మకు ముంబై కెప్టెన్సీ ఛాన్స్ ఇస్తుందో లేదా పాండ్యను కొనసాగిస్తుందో అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.

News October 17, 2024

సిద్దిపేట కుంకుమ పువ్వు వచ్చేస్తోంది!

image

TG: సిద్దిపేట కుంకుమ పువ్వు.. ఇకపై ఈ బ్రాండ్ మార్కెట్‌లో లభించనుంది. కశ్మీర్ లాంటి చల్లని వాతావరణంలో సాగయ్యే ఈ పంటను DXN కంపెనీ ఏరోఫోనిక్స్ టెక్నాలజీతో సాగు చేసి ఔరా అనిపించింది. సిద్దిపేట అర్బన్(M) మందపల్లిలో ఈ కంపెనీ ఉంది. ఇక్కడ కుంకుమ పువ్వు సాగవడానికి అవసరమయ్యే పరిస్థితుల్ని ఓ గదిలో ఏర్పాటు చేశారు. 40 వేల మొక్కలతో ఎకరా స్థలంలో రావాల్సిన 600 గ్రాముల పువ్వు గది విస్తీర్ణంలోనే సాగు అయ్యింది.

News October 17, 2024

STOCK MARKET: ఆటో షేర్లు డౌన్.. ఐటీ షేర్లు అప్

image

గ్లోబల్ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలతో ప్రీమార్కెట్ సెషన్లో దూకుడు ప్రదర్శించిన బెంచ్‌మార్క్ సూచీలు ప్రస్తుతం నష్టాల బాట పట్టాయి. కీలక సపోర్ట్ లెవల్స్ బ్రేక్ అవ్వడంతో భారీ పతనం దిశగా సాగుతున్నాయి. నిఫ్టీ 24,837 (-133), సెన్సెక్స్ 81,233 (-267) వద్ద ట్రేడవుతున్నాయి. NSEలో 1812 స్టాక్స్ పతనమవ్వగా 628 మాత్రమే పెరిగాయి. ఆటో షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ నెలకొంది. ఐటీ స్టాక్స్ జోరు మీదున్నాయి.