News October 17, 2024

HYD: బైకులు ఎత్తుకెళ్తున్నారు.. జాగ్రత్త..!

image

ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలకు చెందిన వారు స్థానికులతో చేతులు కలిపి బండ్లను కొట్టేస్తున్నట్లు పోలీసులు తాజాగా తేల్చారు. HYD పాతబస్తి, శివారు ప్రాంతాల్లో దొంగతనాల కోసం మైనర్లకు కమీషన్లు ఆశ చూపిస్తున్నారు. కేవలం 10 సెకండ్లలో హ్యాండిల్ లాక్ తీసి ఎత్తుకెళ్తున్నారు. ఈ ఏడాది HYDలో 1,300 పైగా బైక్ చోరీ కేసులు నమోదు అయ్యాయి. ఇంటి బయట బైక్‌లు పార్కింగ్ చేసేవారు జాగ్రత్త. #SHAREIT

Similar News

News July 6, 2025

ఖైరతాబాద్: లైసెన్స్ రెన్యూవల్‌కు దూరం.. దూరం !

image

గ్రేటర్‌లో ఏ వ్యాపారం నిర్వహించాలన్నా GHMC ట్రేడ్ లైసెన్స్ కచ్చితంగా ఉండి తీరాలి. దీనిని ప్రతి సంవత్సరం డిసెంబర్ 31లోగా రెన్యూవల్ చేయించాలి. అయితే ఖైరతాబాద్ సర్కిల్ పరిధిలో 10వేల వ్యాపార సంస్థలు ఉంటే 4వేల మంది, జూబ్లిహిల్స్ సర్కిల్‌లో 15వేల మంది వ్యాపారులు ఉంటే 7వేల మంది మాత్రమే తమ ట్రేడ్ లైసెన్సులు పునరుద్ధరించుకున్నారు. ఏడు నెలలు దాటుతున్నా లైసెన్సు రెన్యూవల్ గురించి వ్యాపారులు ఆలోచించడం లేదు.

News July 6, 2025

HYD: గ్రేటర్లో 4 ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లు

image

గ్రేటర్ HYD పరిధిలో మొత్తం 4 ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్క కేంద్రానికి సుమారు ఎకరా స్థలం అవసరం ఉందని, ప్రస్తుతం స్థలాల ఎంపిక కొనసాగుతుందని, అనువైన స్థలం దొరకని కారణంగా లేట్ అవుతున్నట్లు సంయుక్త రవణ శాఖ కమిషనర్ రమేశ్ తెలిపారు. దీంతో రోడ్డుపై వాహనం ఎక్కాలంటే ఈ ఆటోమేటిక్ స్టేషన్లలో చెకింగ్ చేయాల్సి ఉంటుంది.

News July 6, 2025

GHMC: అసలు మనకెన్ని ఆస్తులున్నాయి..?

image

GHMCకి అసలు స్థిరాస్తులు ఎన్ని ఉన్నాయో అధికారులకు అంతుపట్టడం లేదు. దీంతో గ్రేటర్ పరిధిలోని ఆస్తులను సర్వే చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఆ మేరకు సర్వే చేయడానికి కన్సల్టెంట్లను టెండర్లకు ఆహ్వానించారు. నాలుగు జోన్లలో దాదాపు 1400 స్థిరాస్తులు ఉన్నాయని రికార్డుల్లో ఉంది. ఎక్కడెక్కడ, ఏఏ ఆస్తులు ఉన్నాయో త్వరలో సర్వే చేసి మొత్తం ఆస్తి వివరాలు తెలుసుకోనున్నారు.