News October 17, 2024

IPL: పంజాబ్ రిటెన్షన్ ఒక్కడే!

image

పంజాబ్ కింగ్స్ ఒక్క ఆటగాడినే రిటైన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అది కూడా వేలంలో పొరపాటున కొన్న శశాంక్ సింగ్‌ను అట్టిపెట్టుకుంటున్నట్లు సమాచారం. కాగా పంజాబ్ మొదటి నుంచీ రిటెన్షన్లపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది. అన్ని ఫ్రాంచైజీలు అందరినీ రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తోంది. అప్పుడే నాణ్యమైన ఆటగాళ్లు అన్ని జట్లకు దొరుకుతారని వాదిస్తోంది. కానీ ఆ జట్టు అభ్యర్థనను BCCI అంత సీరియస్‌గా తీసుకోలేదు.

Similar News

News October 17, 2024

తగ్గేదే లే అంటోన్న పంత్

image

పరిస్థితులు ఎలా ఉన్నా రిషభ్ పంత్ మాత్రం తన దూకుడు తగ్గదని మరోసారి నిరూపించారు. NZతో తొలి టెస్టులో భారత్ 12 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న సమయంలో పంత్ క్రీజులోకి వచ్చారు. బంతి స్వింగ్ అవుతుండటంతో తన ట్రేడ్‌మార్క్ షాట్‌కు ప్రయత్నించారు. పంత్ ధైర్యం చూసి ప్రత్యర్థులు సైతం ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం జైస్వాల్ (12*), పంత్ (13) నెమ్మదిగా కుదురుకుంటున్నారు.

News October 17, 2024

21న కొత్త మెడికల్ కాలేజీలు ప్రారంభం

image

తెలంగాణలో కొత్తగా ఏర్పాటైన 8 మెడికల్ కాలేజీలను ఈ నెల 21న ప్రారంభించాలని వైద్య, ఆరోగ్య శాఖ నిర్ణయించింది. వీటిని CM రేవంత్‌తో ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. మంత్రి సీతక్క నియోజకవర్గంలోని కాలేజీని ప్రారంభించాలని CMను కోరినట్లు సమాచారం. జోగులాంబ గద్వాల, నారాయణపేట, ములుగు, నర్సంపేట, మెదక్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో మెడికల్ కాలేజీలు ఏర్పాటైన సంగతి తెలిసిందే.

News October 17, 2024

పంత్‌కు షాక్.. ఢిల్లీ కెప్టెన్‌గా అక్షర్ పటేల్?

image

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో కీలక మార్పులు చేస్తోంది. ఇప్పటికే హెడ్ కోచ్ రికీ పాంటింగ్‌ను తప్పించగా, కెప్టెన్ రిషభ్ పంత్‌పైనా వేటు వేయనున్నట్లు సమాచారం. అతని స్థానంలో అక్షర్ పటేల్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించనుందని వార్తలు వస్తున్నాయి. అయితే పంత్‌ను రూ.18 కోట్లకు రిటెన్షన్ చేసుకుంటుందని తెలుస్తోంది. కాగా తాను వేలంలో పాల్గొంటే ఎంత రేటు రావొచ్చని ఇటీవల రిషభ్ చేసిన <<14336476>>ట్వీట్<<>> వైరలైన విషయం తెలిసిందే.