News October 17, 2024

కరీంనగర్: వినూత్నంగా యువ నాయకుడి మేనిఫెస్టో!

image

కరీంనగర్ జిల్లా వీణవంక మండలం లక్ష్మక్కపల్లిలో సర్పంచ్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ముందస్తు మేనిఫెస్టోను యువ నాయకుడు మద్దుల ప్రశాంత పటేల్ విడుదల చేశారు. తనను గెలిపిస్తే 10 తరాలు గుర్తుండిపోయేలా చేస్తానంటూ ముందస్తుగా విడుదల చేసి నాయకులు ఆలోచింపజేసే విధంగా చేశారు. ప్రతి నెల హెల్త్ క్యాంప్, ఆడ పిల్ల పెళ్లి కానుక, మూతబడిన పాఠశాల రీ-ఓపెన్, ఆడపడుచులకు టైలరింగ్ శిక్షణ తదితర హామీలు మేనిఫెస్టోలో ఉన్నాయి.

Similar News

News January 20, 2026

కరీంనగర్: ప్రయోగశాలల సామగ్రికి టెండర్ల ఆహ్వానం

image

కరీంనగర్ జిల్లాలోని 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు ప్రయోగ సామగ్రి పంపిణీ కోసం సీల్డ్ టెండర్లను ఆహ్వానిస్తున్నట్లు డీఐఈఓ వి.గంగాధర్ తెలిపారు. కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశానుసారం, ఫిబ్రవరి 2 నుంచి జరిగే ప్రయోగ పరీక్షల నిమిత్తం ఈ ప్రక్రియ చేపట్టారు. ఆసక్తి గల పంపిణీదారులు పద్మనగర్‌లోని డీఐఈఓ కార్యాలయంలో సంప్రదించి కొటేషన్లు సమర్పించాలన్నారు.

News January 20, 2026

KNR: ‘విశ్రాంత ఉద్యోగులకు జీపీఎఫ్ డబ్బులు చెల్లించాలి’

image

విశ్రాంత ఉద్యోగులకు జీపీఎఫ్ ఫైనల్ పేమెంట్ త్వరితగతిన చెల్లించాలని ఎస్టీయూ నాయకులు జిల్లా ట్రెజరీ అధికారి నాగరాజును కోరారు. ఈమేరకు సోమవారం ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు పిన్నింటి తిరుపతిరావు, ప్రధాన కార్యదర్శి కోట శ్యామ్‌కుమార్ డీటీఓను కలిసి విన్నవించారు. అలాగే కులగణన సర్వేలో పాల్గొన్న సిబ్బంది డబ్బులు కూడా సకాలంలో చెల్లించాలని వారు కోరారు.

News January 19, 2026

కరీంనగర్: ‘కార్టూన్.. సమాజాన్ని ప్రశ్నించే అస్త్రం’

image

సమాజంలోని రుగ్మతలను ప్రశ్నించడానికి కార్టూన్ ఒక శక్తివంతమైన మాధ్యమమని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేల సత్పతి అన్నారు. సోమవారం ఎస్.ఆర్.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన రెండు రోజుల వ్యంగ్య చిత్ర కళా శిక్షణను ఆమె ప్రారంభించారు. వేగవంతమైన ఈ ప్రపంచంలో తక్కువ సమయంలోనే లోతైన ప్రభావం చూపే శక్తి కార్టూన్లకు ఉందని, విద్యార్థులు ఈ కళను నేర్చుకోవాలని కలెక్టర్ సూచించారు.