News October 17, 2024
మద్యంపై ఆ పన్నులు తొలగింపు

AP: మద్యంపై ఉన్న పలు రకాల పన్నులు, మార్జిన్‌లను కూటమి సర్కార్ తొలగించింది. గత ప్రభుత్వంలో ఉన్న 4శాతం రిటైల్ ఎక్సైజ్ పన్ను, ఏపీఎస్‌బీసీఎస్ రిటైల్ మార్జిన్(6శాతం), ల్యాండెడ్ కాస్ట్‌పై 10 శాతం అదనపు ఎక్సైజ్ సుంకాలకు స్వస్తి పలికింది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ముఖ్యకార్యదర్శి ముకేశ్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో మొత్తంగా 10 రకాల పన్నులు ఉండగా అవి 6కి తగ్గాయి.
Similar News
News January 16, 2026
ఆరోగ్యం కోసం.. రోజూ ఉదయాన్నే ఇలా చేయండి

రోజును సరైన పద్ధతిలో ప్రారంభించడం ఆరోగ్యానికి కీలకమని నిపుణులు చెబుతున్నారు. 10 నిమిషాల పాటు చేసే చిన్న అలవాట్లు శరీరానికి ఎంతో మేలు చేస్తాయని పేర్కొన్నారు. ఉదయం నిద్రలేచిన వెంటనే నీరు తాగితే శరీరం హైడ్రేట్ అవుతుందని, ఖాళీ కడుపుతో కాఫీ/టీ తాగొద్దని సూచిస్తున్నారు. అదే విధంగా తేలికపాటి వ్యాయామం, మెడిటేషన్ చేస్తే గుండె, మెదడు పని తీరుతో పాటు పేగుల కదలికలను మెరుగుపరుస్తుందని వెల్లడించారు.
News January 16, 2026
కనుమ రోజు ఏ దేవుడిని పూజించాలంటే?

కనుమ నాడు పశువుల దైవమైన కాటమరాజుని, సకల దేవతా స్వరూపమైన కామధేనువును భక్తి శ్రద్ధలతో పూజించాలని పండితులు సూచిస్తున్నారు. పశుసంపదను చల్లగా చూడమని కోరుతూ ఊరి పొలిమేరల్లో మొక్కులు చెల్లిస్తారు. ఇలా చేస్తే పంటలు సమృద్ధిగా పండుతాయని నమ్మకం. ఈ రోజున పశువులను అందంగా అలంకరించి, వాటికి దిష్టి తీసి ఆయురారోగ్యాలు కలగాలని ప్రార్థిస్తారు. పిండివంటల తర్వాత కనుమ నాటి మాంసాహార విందులతో పండుగ సందడి ముగుస్తుంది.
News January 16, 2026
20 శాతం పెరగనున్న డిఫెన్స్ బడ్జెట్!

2026-27 ఆర్థిక సంవత్సరంలో డిఫెన్స్ బడ్జెట్‌ను 20% పెంచాలని భారత రక్షణ శాఖ కోరుతోంది. గత ఏడాది కేంద్రం రూ.6.81 లక్షల కోట్ల కేటాయించగా.. ఈసారి మరింత ఖర్చు అవసరమని పేర్కొంది. గత బడ్జెట్ తీరులను చూస్తే 20 శాతం పెంపు అంటే అతిగా ఆశ పడటమే అని విశ్లేషకులు అంటున్నారు. అయితే <<18845622>>ఆపరేషన్ సిందూర్<<>>తో పాటు ప్రపంచ వ్యాప్తంగా మారుతున్న పరిస్థితుల దృష్ట్యా బడ్జెట్‌లో కేటాయింపులు పెరగాలని పలువురు భావిస్తున్నారు.


