News October 17, 2024

మార్గాని భ‌ర‌త్ అండ‌తో దాడి చేశారు: మంత్రి లోకేశ్

image

జ‌గ‌న్‌ని ఆద‌ర్శంగా తీసుకొని వైసీపీ నేత‌లు రెచ్చిపోతున్నారని, అధికారం పోయినా అరాచ‌కాలు మాత్రం త‌గ్గట్లేదని మంత్రి లోకేశ్ విమర్శించారు. ‘జ‌గ‌న్ పాల‌న‌లో నేరాలకు అల‌వాటైన పిల్ల సైకోలు రెచ్చిపోతున్నారు. మాజీ ఎంపీ మార్గాని భ‌ర‌త్ అండ‌తో ఈవెంట్ యాంక‌ర్ కావ్య, ఆమె కుటుంబ‌ స‌భ్యుల‌పై వైసీపీ గుండాలు దాడి చేశారు. మహిళపై దాడి చేసిన గ్యాంగ్‌పై చర్యలు తప్పవు’ అని ఎక్స్‌‌ వేదికగా లోకేశ్ హెచ్చరించారు.

Similar News

News December 27, 2025

జిల్లాలో ఖాళీల ఖిల్లా.. పండుగ వేళ పోలీసులకు సవాల్!

image

తూర్పుగోదావరి జిల్లాలో పండుగ వేళ శాంతిభద్రతల పరిరక్షణ సవాల్‌గా మారింది. కీలకమైన ఏఎస్పీ, డీఎస్పీ పోస్టులు ఖాళీగా ఉండటం విధి నిర్వహణపై ప్రభావం చూపుతోంది. రాజమండ్రిలో ముగ్గురు ఏఎస్పీలకు గాను ఎవరూ అందుబాటులో లేరు. ట్రాఫిక్, మహిళా పీఎస్, సెంట్రల్ డీఎస్పీ పోస్టులు కూడా ఖాళీగానే ఉన్నాయి. నూతన సంవత్సర, సంక్రాంతి వేడుకల వేళ సిబ్బంది కొరత పోలీసు శాఖను వేధిస్తోంది.

News December 27, 2025

29న యథావిధిగా ‘పీజీఆర్‌ఎస్’: కలెక్టర్

image

డిసెంబర్ 29న కలెక్టరేట్ నుంచి గ్రామ, వార్డు సచివాలయాల వరకు ‘ప్రజా గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టమ్’ (PGRS) కార్యక్రమం యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. అర్జీదారులు నేరుగా లేదా Meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో తమ వినతులను నమోదు చేసుకోవచ్చని సూచించారు. ప్రజల నుంచి వచ్చే సమస్యలను స్వీకరించి, వాటికి తక్షణ పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

News December 27, 2025

ఏపీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా అమర్జహ బేగ్ బాధ్యతలు

image

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కొవ్వూరు మండలం కాపవరానికి చెందిన అమర్జహ బేగ్ నియమితులయ్యారు. శనివారం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో అఖిల భారత మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కా లాంబా చేతుల మీదుగా ఆమె నియామక పత్రాన్ని అందుకున్నారు. ప్రస్తుతం ఏఐసీసీ సభ్యురాలిగా ఉన్న అమర్జహ బేగ్ నియామకం పట్ల పలువురు కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.