News October 17, 2024

ఏలూరులో జాబ్ మేళా.. టెన్త్ పాసైతే చాలు

image

రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, సీడాప్‌, జిల్లా ఉపాధి కార్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 22న ఏలూరు ఐటీఐ కాలేజీలో జాబ్‌ మేళా నిర్వహిస్తున్నట్లు సంస్థ జిల్లా ఇన్‌ఛార్జ్ వాడపల్లి కిశోర్‌ బుధవారం తెలిపారు.10, ఇంటర్ , డిగ్రీ, ఐటీఐ పూర్తి చేసిన వారు అర్హులన్నారు. హీరో, మోహన్‌ స్పింటెక్స్‌, అపోలో ఫార్మసీ కంపెనీల ప్రతినిధులు వస్తారని, సుమారు 180 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయని తెలిపారు.

Similar News

News July 4, 2025

మొగల్తూరు: కారు ఢీకొని రైతు మృతి

image

పేరుపాలెం నార్త్‌లో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రైతు గుత్తుల పెద్దిరాజు మృతి చెందారు. పేరుపాలెం బీచ్ నుంచి భీమవరం వెళ్తున్న స్విఫ్ట్ డిజైర్ కారు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ సమీపంలో అదుపుతప్పి పంట కాలువలోకి దూసుకెళ్లింది. కాలువ పక్కనే పచ్చగడ్డి కోస్తున్న పెద్దిరాజును కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో ఉన్న వారికి ఏమి కాలేదు. అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు.

News July 4, 2025

తణుకులో అత్యధిక వర్షపాతం నమోదు

image

గడచిన 24 గంటల వ్యవధిలో జిల్లా వ్యాప్తంగా 34.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు శుక్రవారం తెలిపారు. జిల్లాలో అత్యధికంగా తణుకు మండలంలో 12.2, ఆచంట 5.2, పెంటపాడు 4.2, పోడూరు 3.6 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. యలమంచిలి, పాలకొల్లు, నరసాపురం, మొగల్తూరు, కాళ్ల, భీమవరం, వీరవాసరం మండలాల్లో వర్షపాతం నమోదు కాలేదని వెల్లడించారు.

News May 7, 2025

జిల్లాలో ప్రస్తుతానికి ఎవరూ లేరు: ఎస్పీ

image

పశ్చిమగోదావరి జిల్లాలో పాకిస్థానీలు ప్రస్తుతానికి ఎవరూ లేరని జిల్లా అద్నాన్ నయీమ్ అస్మి శనివారం తెలిపారు. కేంద్ర హోం శాఖ మంత్రి ఆదేశాలతో పాస్పోర్ట్, వీసాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామన్నారు. జిల్లావ్యాప్తంగా పోలీసులు తనిఖీల్లో ప్రజల సహకరించాలని కలెక్టర్  నయీమ్ అస్మి విజ్ఞప్తి చేశారు.