News October 17, 2024

VZM: జిల్లాకు వాతావరణ శాఖ హెచ్చరిక

image

ఉమ్మడి విజయనగరం జిల్లాకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటినప్పటికీ మధ్యాహ్నం వరకు సముద్రంపై ఆ ప్రభావం కొనసాగుతూనే ఉంటుందని వెల్లడించింది. సుముద్ర తీరం అల్లకల్లోలంగా ఉంటుందని పేర్కొంది. సాధారణ రోజుల కంటే 1.5 మీటర్ల ఎత్తు అదనంగా అలలు ఎగసిపడే అవకాశం ఉందని సూచించింది.

Similar News

News October 17, 2024

VZM: అధికార యంత్రాంగానికి మంత్రి కీలక ఆదేశాలు

image

గుర్లలో డయేరియా బాధితులను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గురువారం పరామర్శించారు. తాగునీటి ప‌థ‌కాల ద్వారా స‌ర‌ఫ‌రా అవుతున్న నీటి నాణ్య‌త‌పై రిపోర్టులు సేక‌రించాల‌ని మంత్రి ఆదేశించారు. ఈ నివేదిక‌ల‌న్నీ స‌మ‌గ్రంగా విశ్లేషించిన త‌ర్వాత నీరు క‌లుషితం కావ‌డానికి కార‌ణాల‌పై ఒక అంచ‌నాకు రావాల‌ని చెప్పారు. అప్ప‌టివ‌ర‌కు గ్రామ‌స్థుల‌కు ఇత‌ర ప్రాంతాల నుంచి ట్యాంక‌ర్ల ద్వారానే నీటిని స‌ర‌ఫ‌రా చేయాల‌న్నారు.

News October 17, 2024

VZM: జిల్లాలో నేటి పెట్రోల్, డీజిల్ ధరలు..

image

విజయనగరంలో గురువారం లీటర్ పెట్రోల్ రూ.109.44గా ఉంది. గత పది రోజుల నుంచి పెట్రోల్ రేట్ రూ.108.69-109.91 మధ్యలో కొనసాగుతోంది. లీటర్ డీజిల్ రూ.97.24 కాగా నిన్నటితో పోల్చితే కొంతమేర పెరిగింది. ఇటు పార్వతీపురం జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ.110.22గా ఉంది. లీటర్ డీజిల్ రూ.97.97 కాగా గత పదిరోజుల నుంచి దీని ధర రూ.97.97-98.11 మధ్యలో కొనసాగుతోంది.

News October 17, 2024

VZM: 29 నుంచి వైద్యసేవ క్షేత్ర సిబ్బంది సమ్మె

image

డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవ పథకంలో పనిచేస్తున్న క్షేత్ర సిబ్బంది సమస్యలు 17 ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోవడం లేదని ఏపీ వైద్యమిత్ర ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు జె.ప్రదీప్ ఆవేదన వ్యక్తం చేశారు. తమ డిమాండ్లపై ఉన్నతాధికారులకు ఇప్పటికే వినతిపత్రం అందజేశామని, ఈ నెల 29న రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలోకి వెళుతున్నట్లు తెలిపారు.