News October 17, 2024

కడప జిల్లాకు అదొక పీడకల

image

కడప నగర ప్రజలకు 2001 అక్టోబర్‌లో వచ్చిన వరదలు ఓ పీడకలను మిగిలిచ్చింది. కడప బుగ్గ వంకకు భారీగా వరద రావడంతో కడప నగరాన్ని చుట్టుముట్టింది. తెల్లవారు జామున నిద్రలేచి తేరుకునేలోపు పలువురు శవాలుగా మారారు. భారీగా ఆస్తినష్టం వాటిల్లింది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పిల్లల్ని భుజాన వేసుకొని రోడ్ల మీద పరుగులు తీశారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలను చూస్తుంటే అక్కడి ప్రజలు ఆ ఘటనను గుర్తుచేసుకుంటున్నారు.

Similar News

News November 6, 2025

కడప: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

image

కడప జిల్లా కొండాపురం మండలంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు చనిపోయారు. తాళ్ల ప్రొద్దుటూరుకు చెందిన బోరు నారాయణరెడ్డి గ్రామం వద్ద బైకుపై రోడ్డు దాటుతుండగా కడప వైపు నుంచి తాడిపత్రి వైపు వెళ్తున్న కారు ఢీకొట్టింది. ఈప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నారాయణరెడ్డి అక్కడికక్కడే మృతిచెందాడు. అతి వేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు.

News November 6, 2025

జమ్మలమడుగు: తండ్రి, కుమార్తెకు జైలుశిక్ష

image

జమ్మలమడుగులోని నాగులకట్ట వీధికి చెందిన గంజి మాధవి(32) బీసీ కాలనీకి చెందిన మునగాల రవి(35) దగ్గర రూ.5లక్షలు అప్పు తీసుకుంది. డబ్బులు తిరిగి ఇవ్వాలని రవి ఒత్తిడి చేయడంతో అతడిపై ఆమె కక్ష పెంచుకుంది. 2017 జనవరి 19న నాగులకట్ట వీధిలో తన తండ్రి సూర్యనారాయణ రెడ్డి(65)తో కలిసి రవిని ఇనుప రాడ్డుతో కొట్టి హత్య చేసింది. నేరం నిరూపణ కావడంతో మాధవి, సూర్యనారాయణకు కోర్టు తాజాగా జీవిత ఖైదు విధించింది.

News November 6, 2025

22 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు: జేసీ

image

జిల్లాలో వరి రైతులకు కనీస మద్దతు ధర అందించేందుకు 22 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జాయింట్ కలెక్టర్ అదితిసింగ్ తెలిపారు. సాధారణ రకం వరికి క్వింటాకు రూ. 2,369, ఏ-గ్రేడ్ రకానికి రూ. 2,389 ప్రభుత్వం చెల్లిస్తుందని స్పష్టం చేశారు. ఈ-క్రాప్, ఈ-కేవైసీతో పాటు తమ పేర్లను నమోదు చేసుకున్న రైతులు మాత్రమే కొనుగోలుకు అర్హులని ఆమె తెలిపారు.