News October 17, 2024

KU డిగ్రీ, పీజీ బ్యాక్‌లాగ్ పేపర్లకు అనుమతి: రిజిస్ట్రార్

image

కేయూ పరిధిలోని డిగ్రీ, పీజీ బ్యాక్‌లాగ్ విద్యార్థులకు 2024- 25 విద్యా సంవత్సరం కాలపరిమితికి సంబంధించి రాత, ప్రాక్టికల్, సెమినార్ పరీక్షలు క్లియర్ చేయడానికి అనుమతి ఇస్తూ రిజిస్ట్రార్ ఆచార్య పి.మల్లారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. విశ్వవిద్యాలయ పరిధిలోని కళాశాలల విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, పరీక్షా ఫీజుకు సంబంధించి మరిన్ని వివరాలకు వెబ్‌సైట్‌లో చూడవచ్చన్నారు.

Similar News

News October 17, 2024

వాంకిడి: బకెట్‌లో పడి 10 నెలల బాలుడు మృతి

image

 ఆసిఫాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. వాంకిడి మండలంలో ప్రమాదవశాత్తు పది నెలల బాలుడు బకెట్‌లో పడి మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. తేజాపూర్ గ్రామానికి చెందిన గిర్మాజీ- సునీత దంపతుల కుమారుడు తన్వీజ్ ఆడుకుంటూ వెళ్లి బాత్ రూమ్‌లో ఉన్న బకెట్‌లో పడిపోయాడు. కుటుంబ సభ్యులు వెళ్లి చూసేసరికి బాలుడు మృతి చెంది కనిపించాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు ఏఎస్సై పోశెట్టి తెలిపారు.

News October 17, 2024

కొమరం భీం ఆశయ సాధన కోసం కృషి చేయాలి: సీతక్క

image

కొమరం భీమ్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. కొమరం భీం 84వ వర్ధంతి సందర్భంగా ఆసిఫాబాద్ జిల్లాలోని కెరమెరి మండలం జోడేఘాట్లో భీమ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటుచేసిన సభలో మాట్లాడారు. తెలంగాణ సాయుధ పోరాటంలో కొమరం భీం చేసిన పోరాటం త్యాగం మరువలేనిది అన్నారు. అతని అడుగుజాడల్లో నడవాలి అన్నారు.

News October 17, 2024

బెల్లంపల్లి: కారు ప్రమాదంలో ప్రముఖ వ్యాపారి మృతి

image

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రాజేష్ కార్వా (42) అనే వ్యాపారి కారు ప్రమాదంలో మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం..ఇవాళ ఉదయం కారులో హైదరాబాదుకు బయలుదేరిన రాజేష్ సిద్దిపేట-గద్వేల్ మార్గమధ్యలో కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో రాజేష్ తీవ్ర గాయాలతో మరణించినట్లు తెలిపారు.