News October 17, 2024

ఆదివాసీలకు, అనాథలకు సహాయాన్ని అందించాలి: గవర్నర్

image

అణగారిన ఆదివాసీలకు, అనాథలకు అవసరమైన సహాయాన్ని అందించాలని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పిలుపునిచ్చారు. బుధవారం రాజ్‌భవన్లో ఆయన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల అధిపతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద అనాథ బాలలకు, ఆదివాసీలకు అవసరమైన సహకారమివ్వాలని సూచించారు. సీఎస్ఆర్ కింద చేయగలిగిన 11రకాల సహాయాల ప్రతిపాదనలను ప్రభుత్వరంగ సంస్థల ప్రతినిధుల ముందు పెట్టింది.

Similar News

News January 7, 2026

రూ.65,650 కోట్ల విలువైన భూములు కాపాడిన హైడ్రా

image

HYDలో ఆక్రమణలపై HYDRAA చర్యలు కొనసాగిస్తోంది. తాజాగా జరిగిన ఎల్‌బీఎస్‌ఎన్ఏలో హైడ్రా క‌మిష‌న‌ర్‌ ప‌వ‌ర్‌ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ఇచ్చారు. చెరువులు, పార్కులు, రోడ్లు, నాలాలు కలిపి 1,313.19 ఎకరాల ప్రభుత్వ భూములను HYDRAA స్వాధీనం చేసుకుంది. వీటి విలువ రూ. 65,650 కోట్లుగా అంచనా. మూసీ పరీవాహక ప్రాంతంలోని ఆక్రమణలు తొలగించి, సహజ ప్రవాహం పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు.

News January 6, 2026

HYD ఈస్ట్ రెసిడెన్స్‌కు గుడ్ న్యూస్!

image

HYD ఈస్ట్ ప్రాంత వాసుల సీవరేజ్ వాటర్ కష్టాలకు చెక్ పడనుంది. నాగోల్‌లోని 320 MLD ప్లాంట్ ఆధునీకరణకు జలమండలి రూ.3.83 కోట్ల భారీ బడ్జెట్‌తో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జల్ హీ అమృత్ పథకంలో భాగంగా ఈ ప్రాజెక్టు చేపట్టనున్నారు. అత్యాధునిక యంత్రాలతో ట్రంక్ సీవర్ల పూడికతీత, నాలాల రక్షణ గోడల మరమ్మతులు చేపట్టనున్నారు. దీంతో మురుగు వాసన తగ్గడమే కాకుండా, శుద్ధి చేసిన నీటిని రీసైక్లింగ్ చేసి వాడుకునే వీలుంటుంది.

News January 6, 2026

HYD: కొత్తగా వర్క్ ఫ్రమ్ విలేజ్!

image

గజ్వేల్, చౌటుప్పల్ వంటి పల్లెలు ఇకపై వ్యవసాయానికే పరిమితం కావు. గ్రిడ్ పాలసీ పేరుతో ప్రభుత్వం గ్రామాల్లో 10Gbps ఇంటర్నెట్, సోలార్ పవర్ హబ్‌‌ను ప్రతిష్ఠిస్తోంది. T-Fiber నెట్‌వర్క్‌ను విద్యుత్ పోల్స్ ద్వారా ప్రతి ఇంటికీ అనుసంధానించడం వల్లే ఇది సాధ్యమవుతోందని అధికారులు తెలిపారు. IT కోసం హైటెక్స్‌ వెళ్లకుండా ల్యాప్‌టాప్ ముందు కూర్చొని విదేశీ ప్రాజెక్టులు చేసేలా ‘వర్క్ ఫ్రమ్ విలేజ్’ ప్లాన్ ఇది.