News October 17, 2024

రాష్ట్రానికి రూపాయి లాభం లేదు.. CM రేవంత్‌పై కేటీఆర్ సెటైర్లు

image

TG: సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనలపై కేటీఆర్ Xలో సెటైర్లు వేశారు. ‘10 నెలల్లో 25 సార్లు హస్తిన పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేశావ్. పైసా పనిలేదు.. రాష్ట్రానికి రూపాయి లాభం లేదు. అన్నదాతల అరిగోసలు, గాల్లో దీపాల్లా గురుకులాలు, కుంటుపడ్డ వైద్యం, గాడితప్పిన విద్యా వ్యవస్థ, ఆడబిడ్డలకు అందని చీరలు, స్కూటీలు, కుట్టు మెషీన్లు లేవు, అవ్వాతాతలకు పెరగని పింఛన్.. అయినా పోయి రావాలె హస్తినకు’ అని ఎద్దేవా చేశారు.

Similar News

News October 17, 2024

వైసీపీలోకి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ముదునూరి

image

AP: వైసీపీ నేతలు అధికారంలో ఉన్న కూటమి పార్టీల్లో చేరుతున్న వేళ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత ముదునూరి మురళీకృష్ణం రాజు ఆ పార్టీని వీడారు. ప్రస్తుతం ఆయన టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా, అమలాపురం నియోజకవర్గ పరిశీలకుడు ఉన్నారు. ఇవాళ మాజీ సీఎం జగన్ సమక్షంలో మురళీకృష్ణంరాజు వైసీపీలో చేరారు.

News October 17, 2024

46 పరుగులకే భారత్ ఆలౌట్

image

NZతో తొలి టెస్టులో టీమ్ ఇండియా బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. 46 పరుగులకే భారత్ ఆలౌటైంది. పంత్ (20), జైస్వాల్ (13) మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్ సాధించారు. విరాట్, సర్ఫరాజ్, కేఎల్ రాహుల్, జడేజా, అశ్విన్ డకౌట్ అయ్యారు. హెన్రీ 5, విలియం 4, సౌథీ ఒక వికెట్ తీశారు.

News October 17, 2024

సల్మాన్‌ఖాన్ ఇంటిపై కాల్పులు జరిపిన షూటర్ అరెస్ట్

image

యాక్టర్ సల్మాన్‌ఖాన్ ఇంటిపై కాల్పుల కేసులో ముందడుగు పడింది. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ షూటర్లలో ఒకరైన సుఖ్ఖాను నవీ ముంబై పోలీసులు అరెస్టు చేశారని IANS తెలిపింది. హరియాణా పోలీసుల సహకారంతో పానిపట్ సెక్టార్ 29లో అతడిని అధీనంలోకి తీసుకున్నారు. గురువారమే కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. సుఖ్ఖాది రైల్ కలాన్ విలేజ్. ఏప్రిల్‌లో బాంద్రాలోని సల్మాన్ ఇంటిపై బిష్ణోయ్ గ్యాంగ్ కాల్పులు జరపడం తెలిసిందే.