News October 17, 2024
నల్గొండ: ఆస్తి తగాదాలలో వ్యక్తి దారుణ హత్య

మాడుగులపల్లి మండలం నారాయణపురం వద్ద దారుణ హత్య జరిగింది. ఆస్తి తగాదాలతో కొండయ్య (60) అనే వ్యక్తిపై కత్తులతో దాడి చేశారు. దీంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Similar News
News January 13, 2026
నల్గొండ: పాఠశాల నిర్మాణ పనుల తనిఖీ

వచ్చే విద్యా సంవత్సరం నాటికి నల్గొండ ఎస్ఎల్ బీసీ వద్ద చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల అకడమిక్ బ్లాక్, తరగతి గదుల నిర్మాణ పనులను పూర్తి చేసి అప్పగించాలని జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన ఎస్ఎల్‌బీసీ వద్ద ఉన్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ పనులను తనిఖీ చేశారు.
News January 13, 2026
రైతన్నకు తప్పని ‘యూరియా’ కష్టాలు

జిల్లాలో యాసంగి వరి నాట్లు ముమ్మరంగా సాగుతున్న వేళ, ఎరువుల కొరత రైతులను వేధిస్తోంది. ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారానే యూరియా తీసుకోవాలన్న నిబంధన రైతులకు ఇబ్బందిగా మారింది. కేవలం PACS, మన గ్రోమోర్ కేంద్రాల్లోనే స్టాక్ ఉండటం, ప్రైవేటు డీలర్లు అమ్మకాలు నిలిపివేయడంతో యూరియా దొరకడం గగనమైంది. పొలాలకు ఎరువులు వేయాల్సిన సమయంలో గంటల తరబడి లైన్లలో నిలబడాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
News January 13, 2026
నల్గొండ: జిల్లాలో ఆరు ‘యంగ్ ఇండియా’ పాఠశాలలు

NLG జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల’ నిర్మాణానికి భూములను గుర్తించినట్లు కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. NLG, మునుగోడులో పనులు ప్రారంభమయ్యాయని, మిగిలిన చోట్ల టెండర్లు పూర్తయ్యాయని వెల్లడించారు. వచ్చే ఏడాది కల్లా స్కూల్స్‌ను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.


