News October 17, 2024

అరుదైన దోమకాటు.. USలో వ్యక్తి మృతి

image

USలో దోమకాటుతో ఈస్టర్న్ ఈక్విన్ ఎన్‌సెఫాలిటిస్(EEE) అనే వ్యాధి బారిన పడి రిచర్డ్(49) అనే వ్యక్తి మరణించాడు. 2019లో ఈ కాటుకు గురవగా ఆస్పత్రిలో ఐదేళ్ల పోరాటం తర్వాత చనిపోయాడు. EEE సోకిన దోమ కుట్టడం వల్ల ఈ వ్యాధి వ్యాపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. జ్వరం, మైగ్రేన్, వాంతులు, విరేచనాలు, మూర్ఛ దీని లక్షణాలు. ఇది సోకిన వారిలో 30% మంది మరణిస్తారు. మిగిలిన వారు నాడీ సంబంధిత సమస్యలతో ఇబ్బందులు పడతారు.

Similar News

News October 17, 2024

ఉప్పల్ స్టేడియం కేసులో ఈడీ దూకుడు

image

TG: ఉప్పల్ స్టేడియంలో నిధుల గోల్‌మాల్ కేసులో 3కంపెనీలకు ED సమన్లు జారీ చేసింది. ఈ నెల 8న అజారుద్దీన్‌ను విచారించిన ED, ఆయన ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా బాడీడ్రెంచ్ ఇండియా, సర స్పోర్ట్స్, ఎక్స్‌లెంట్ ఎంటర్‌ప్రైజెస్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22న విచారణకు రావాలని ఆదేశించింది. జనరేటర్స్, జిమ్ పరికరాలు, క్రికెట్ బాల్స్, ఇతర వస్తువుల్లో అక్రమాలు జరిగాయని అజారుద్దీన్‌పై కేసు నమోదైన సంగతి తెలిసిందే.

News October 17, 2024

సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్‌మీట్

image

TG: ఇవాళ సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడనున్నారు. మూసీ సుందరీకరణ, హైడ్రా, గ్రూప్-1 మెయిన్స్, అప్పులపై ప్రతిపక్షాల విమర్శలపై స్పందించనున్నారు.

News October 17, 2024

బెయిల్ కండీషన్.. ‘భారత్ మాతాకీ జై చెప్పాల్సిందే’

image

మధ్యప్రదేశ్‌లో ‘పాకిస్థాన్ జిందాబాద్.. హిందుస్థాన్ ముర్దాబాద్’ నినాదాలు చేసిన నిందితుడు ఫైజల్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కేసు ముగిసే వరకు ప్రతి నెలా మొదటి, చివరి మంగళవారం మిస్రోడ్ పోలీస్ స్టేషన్‌లో రిపోర్టు చేయాలని ఆదేశించింది. ‘భారత్ మాతా కీ జై’ అంటూ నినదిస్తూ అక్కడి జాతీయ జెండాకు 21సార్లు సెల్యూట్ చేయాలని స్పష్టం చేసింది. స్టేట్ కౌన్సిల్ బెయిల్‌కు అడ్డుచెప్పగా, న్యాయమూర్తి తోసిపుచ్చారు.