News October 17, 2024

కృష్ణా: విద్యార్థులకు గమనిక.. గడువు పొడిగింపు

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ (ఇయర్ ఎండ్) వన్ టైం ఆపర్చ్యూనిటీ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును పొడిగించారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఫీజు చెల్లింపు గడువు ఇటీవల ముగియగా, ఆ గడువును ఈ నెల 30 వరకు పొడిగించామని వర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది. ఈ పరీక్షలు రాసే విద్యార్థులు అపరాధ రుసుము లేకుండా ఈ నెల 30లోపు ఫీజు చెల్లించాలని సూచించింది. 

Similar News

News May 7, 2025

మచిలీపట్నం: జిల్లా జడ్జిని కలిసిన కలెక్టర్ 

image

కృష్ణా జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా మూడు రోజులు క్రితం బాధ్యతలు స్వీకరించిన గోపిని శుక్రవారం కలెక్టర్ డీకే బాలాజీ మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా కోర్టులో జడ్జిని కలిసిన కలెక్టర్ మొక్కను అందించి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఇద్దరు కొద్దిసేపు భేటీ అయి జిల్లాలో జరుగుతున్న పరిపాలనా అంశాలు, న్యాయ అంశాలపై చర్చించారు. 

News May 7, 2025

గన్నవరం విమానాశ్రయంలో మోదీ పర్యటనపై సమీక్ష 

image

అమరావతి రాజధాని ప్రాంతంలో ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ఏర్పాట్లు, భద్రతా అంశాలపై గన్నవరం విమానశ్రయంలో ప్రభుత్వ విభాగాల అధికారులు, విమానశ్రయ అధికారులతో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర నోడల్ అధికారి వీరపాండ్యన్, కలెక్టర్ డీ.కే బాలాజీ, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, S.P గంగాధర రావు, విమానశ్రయ డైరక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. 

News April 25, 2025

తేలప్రోలు: కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు

image

హౌరా-చెన్నై మధ్య నడిచే కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌లో కార్గో బోగి రైల్వే చక్రాలు దగ్గర మంటలు చెలరేగాయి. శుక్రవారం ఉదయం తేలప్రోలు దగ్గర మంటలు రావడంతో లోకో పైలట్ అప్రమత్తమై ట్రైన్‌ను నిలిపివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. తేలప్రోలు రైల్వే స్టేషన్ దాటిన తర్వాత ఈ ఘటన జరిగింది. లోకో పైలట్ మంటలను ఆర్పి వేశారు. 

error: Content is protected !!