News October 17, 2024

తెలంగాణ పత్తి రైతులపై ఎందుకీ వివక్ష?: హరీశ్ రావు

image

TG: గుజరాత్ పత్తికి మద్దతు ధరగా క్వింటాకు ₹8,257 చెల్లిస్తున్న కేంద్రం.. తెలంగాణ పత్తికి ₹7,521 మాత్రమే ఇవ్వడం దుర్మార్గమని హరీశ్‌రావు మండిపడ్డారు. రాష్ట్ర రైతులపై ఎందుకీ వివక్ష అని ప్రశ్నించారు. ‘వన్ నేషన్-వన్ ట్యాక్స్, వన్ ఎలక్షన్, వన్ రేషన్ కార్డ్, వన్ మార్కెట్ అని ఊదరగొట్టే కేంద్రం వన్ నేషన్- వన్ MSP ఎందుకు ఇవ్వట్లేదు. ధర ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఎందుకుంది?’ అని Xలో నిలదీశారు.

Similar News

News October 17, 2024

ఆ సినిమాకు ప్రీక్వెల్ చేసే ఆలోచన: జ్ఞానవేల్

image

సూపర్ స్టార్ రజినీకాంత్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘వేట్టయన్’. ఈ సినిమా తెలుగులో మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలో సినిమాకు ప్రీక్వెల్ చేసే ఆలోచనలో ఉన్నట్లు దర్శకుడు జ్ఞానవేల్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. వేట్టయన్ కథను నిజ జీవితాల్లోనుంచే తీసుకున్నట్లు చెప్పారు. తర్వాతి ప్రాజెక్టుల గురించి నవంబర్‌లో వెల్లడిస్తానన్నారు.

News October 17, 2024

ఎయిర్ ఇండియా విమానాల్లో బాంబులు పెట్టా.. దుండగుడి ట్వీట్

image

విమానాలకు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. మూడు రోజుల్లోనే డజనుకుపైగా విమానాలకు బాంబు బెదిరింపు హెచ్చరికలొచ్చాయి. అయితే, ఎయిర్ ఇండియాకు చెందిన 5 విమానాల్లో బాంబులు పెట్టినట్లు ఓ X యూజర్ చేసిన ట్వీట్ దుమారం రేపుతోంది. ‘5 విమానాల్లో పేలుడు పదార్థాలను అమర్చా. త్వరగా దిగిపోండి’ అని @psychotichuman0 అనే X యూజర్ ఎయిర్ ఇండియాకు హెచ్చరించాడు. పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.

News October 17, 2024

మందుబాబులకు షాక్.. పెరగనున్న మద్యం ధరలు?

image

TG: మద్యం ధరల పెంపునకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. బీర్ల ఉత్పత్తి కేంద్రాలకు చెల్లించే ధరలను సర్కార్ రెండేళ్లకోసారి పెంచుతోంది. ఈసారి వివిధ రకాల బ్రాండ్లపై రూ.20-150 వరకు పెంచాలని బ్రూవరీలు కోరాయి. ఈమేరకు త్వరలోనే ప్రభుత్వం ధరల పెంపుపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. మద్యం ఆదాయాన్ని ఎక్సైజ్‌ శాఖ అదనంగా మరో రూ.5,318 కోట్లకు పెంచాలన్న ప్రభుత్వ ఆదేశాలూ ధరల పెంపునకు మరో కారణంగా తెలుస్తోంది.