News October 17, 2024

MBNR: త్వరలోనే పంచాయతీ ఎన్నికలు.. ఓటర్ లిస్ట్ చెక్ చేసుకోండి!

image

త్వరలోనే రానున్న పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో తుది ఓటరు జాబితాను అధికారులు ఇప్పటికే విడుదల చేశారు. ఎన్నికల సంఘం tsec.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.జిల్లా, మండలం, గ్రామం వివరాలు నమోదు చేయగానే మరో పేజీ కనిపిస్తుంది. వివరాలు నమోదు చేసిన తర్వాత పంచాయతీకి సంబంధించిన ఓటరు జాబితా కనిపిస్తుంది. వార్డుల వారీగా అందులో పేరు చూసుకోవచ్చు. #SHARE IT

Similar News

News October 17, 2024

వాల్మీకి మహర్షి జీవిత చరిత్ర అందరికీ ఆదర్శం: యోగేష్

image

వాల్మీకి మహర్షి జీవిత చరిత్ర అందరికీ ఆదర్శమని ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. గురువారం నారాయణపేట ఎస్పీ కార్యాలయంలో వాల్మీకి మహర్షి జయంతిని ఘనంగా నిర్వహించారు. వాల్మీకి చిత్రపటానికి ఎస్పీ పూలమాలలు వేసి నివాళి అర్పించారు. వాల్మీకి సామాన్య వ్యక్తిగా జీవించి బోయవానిగా జీవితం గడిపి సప్తఋషులు బోధనల ద్వారా మహర్షిగా మారి అద్భుతమైన రామాయణాన్ని రచించిన గొప్ప వ్యక్తి అని అన్నారు. సిబ్బంది పాల్గొన్నారు.

News October 17, 2024

ఆసియా నెట్ బాల్ పోటీలకు డైరెక్టర్‌గా రామ్మోహన్ గౌడ్

image

ధన్వాడ మండల కేంద్రానికి చెందిన ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ మాదారం రామ్మోహన్ గౌడ్ 13వ మహిళా ఆసియా నెట్ బాల్ పోటీలకు టెక్నికల్ ఆఫీసర్‌గా నియమితులయ్యారు. ఈరోజు నుంచి 21 వరకు బెంగళూరులోని కోరమండల్ ఇండోర్ స్టేడియంలో ఆసియా మహిళా నెట్ బాల్ పోటీలు జరగనున్నాయి. ఈ పోటీలకు ఫిజికల్ డైరెక్టర్ గా ఎంపికైన రామ్మోహన్ గౌడ్ మండలంలోని కొండాపూర్ గురుకుల పాఠశాలలో పీడిగా పనిచేస్తూ నెట్ బాల్ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు.

News October 17, 2024

ఉమ్మడి జిల్లా నేటి వర్షపాత వివరాలు ఇలా..

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా గురువారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా.. గద్వాల జిల్లా అలంపూర్ లో 51.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో 33.5 మిల్లీమీటర్లు, నారాయణపేట జిల్లా కేంద్రంలో 21.5 మిల్లీమీటర్లు, వనపర్తి జిల్లా దగడలో 19.0 మిల్లీమీటర్లు, మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో 12.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.