News October 17, 2024

అన్నాడీఏంకేకు పవన్ కళ్యాణ్‌ శుభాకాంక్షలు

image

అన్నాడీఎంకే 53వ వార్షికోత్సవం సందర్భంగా ఆ పార్టీ నేతలు, కార్యకర్తలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ఆ పార్టీ వ్యవస్థాపకుడు ఎంజీఆర్‌ తాను ఆరాధించే గొప్ప నాయకుడని, పేదల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఆయన వారసత్వాన్ని జయలలిత కొనసాగించారని, ఆమె అడుగుజాడల్లో పార్టీ మరింత పుంజుకోవాలని ఆకాంక్షించారు. తమిళ భాష, సంస్కృతి, వారి పోరాట పటిమ పట్ల తనకెంతో గౌరవముందని పేర్కొన్నారు.

Similar News

News October 17, 2024

రిటైర్డ్ పోలీస్ అధికారులతో టీమ్ ఏర్పాటు: KTR

image

TG: BRS కార్యకర్తలు, నాయకులు ఎవరూ భయపడొద్దని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అన్నారు. తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ కొందరు పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల్లా మారిపోయారని, అయినా భయపడొద్దన్నారు. RS.ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో రిటైర్డ్ పోలీస్ అధికారులతో ఒక టీమ్ ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.

News October 17, 2024

ఆ ప్లాంట్‌లో కోటి కార్లు ఉత్పత్తి చేశాం: మారుతి

image

హరియాణాలోని మానేసర్ ప్లాంట్‌ మొదలైనప్పటి నుంచి తమ సంస్థ అక్కడ కోటి కార్లను ఉత్పత్తి చేసిందని మారుతీ సుజుకీ ఓ ప్రకటనలో తెలిపింది. కేవలం 18 ఏళ్లలోనే ఈ ఘనత సాధించినట్లు పేర్కొంది. గురుగ్రామ్, మానేసర్, గుజరాత్‌లో మారుతికి ఉత్పత్తి ప్లాంట్లున్నాయి. మానేసర్‌లో బ్రెజా, ఎర్టిగా, ఎక్స్‌ఎల్ 6, సియాజ్, డిజైర్, వాగన్ ఆర్, ఎస్ ప్రెస్సో కార్లను తయారు చేసి భారత్‌తో పాటు విదేశాలకూ ఎగుమతి చేస్తోంది.

News October 17, 2024

కాసేపట్లో వర్షం

image

తెలంగాణలోని చాలా జిల్లాల్లో రానున్న 2 గంటల్లో వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కొత్తగూడెం, జగిత్యాల, జనగామ, భూపాలపల్లి, గద్వాల, కామారెడ్డి, యాదాద్రి, WGL, సూర్యాపేట, సిద్దిపేట, RR, కరీంనగర్, నల్గొండ, మెదక్, ఖమ్మం, నిర్మల్, పెద్దపల్లి, సిరిసిల్ల తదితర జిల్లాల్లో మోస్తరు వాన పడొచ్చని పేర్కొంది. కాగా ఇవాళ ఉదయం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది.