News October 17, 2024

46 పరుగులకే భారత్ ఆలౌట్

image

NZతో తొలి టెస్టులో టీమ్ ఇండియా బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. 46 పరుగులకే భారత్ ఆలౌటైంది. పంత్ (20), జైస్వాల్ (13) మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్ సాధించారు. విరాట్, సర్ఫరాజ్, కేఎల్ రాహుల్, జడేజా, అశ్విన్ డకౌట్ అయ్యారు. హెన్రీ 5, విలియం 4, సౌథీ ఒక వికెట్ తీశారు.

Similar News

News October 17, 2024

మూసీ ప్రాజెక్టులో ఒక్క రూపాయి కూడా ఆశించట్లేదు: రేవంత్

image

TG: రాష్ట్రాన్ని, నగరాన్ని బాగుచేయడానికే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తనకు ఇప్పటికే ఆస్తి, అంతస్తులు, పదవి అన్నీ వచ్చాయని చెప్పారు. ఈ సమయంలో ఎవ్వరినో మోసం చేయాల్సిన అవసరం లేదన్నారు. మూసీ ప్రాజెక్టుకు వెచ్చించే రూ.1.50 లక్షల కోట్లలో తాము ఒక్క రూపాయి కూడా ఆశించట్లేదని సీఎం తెలిపారు. తమ మంత్రులు కూడా ప్రజలకు మేలు చేసేందుకే పనిచేస్తున్నారని పేర్కొన్నారు.

News October 17, 2024

హోరాహోరీగా పోరాడి చిరుతను చంపిన వృద్ధ రైతు

image

యూపీలోని బిజ్నోర్ జిల్లాలో రైతు తగ్వీర్ సింగ్(60) తనపై దాడి చేసిన చిరుతను కొట్టి చంపారు. కలాఘర్ ప్రాంతంలోని భిక్కవాలా గ్రామంలో తగ్వీర్ తన పొలంలో పని చేస్తుండగా ఓ చిరుత అకస్మాత్తుగా దాడి చేసింది. అతడిని పొదల్లోకి తీసుకెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. అయితే తన దగ్గరున్న కర్రతో చిరుత తలపై బాదడంతో అది మృతి చెందింది. తగ్వీర్ పరిస్థితి సైతం విషమంగా ఉంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

News October 17, 2024

KTR, హరీశ్, ఈటలకు కిరాయి చెల్లిస్తా: రేవంత్

image

మూసీ పునరుజ్జీవాన్ని అడ్డుకునే నేతలు మూడు నెలలు ఆ పరీవాహక ప్రాంతంలో ఉండాలని CM రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. KTR,హరీశ్, ఈటల మూసీ ఒడ్డున ఇళ్లలో ఉంటే తానే కిరాయి చెల్లిస్తానన్నారు. లేదంటే ఖాళీ చేయించిన ఇళ్లలో అయినా ఉండొచ్చన్నారు. ఆ టైంలో వారికి ఆహారం సహా ఇతర సౌకర్యాలూ చెల్లించాలని కమిషనర్ దానకిషోర్‌ను ఆదేశిస్తున్నట్లు చెప్పారు. వారు ఉండలేరని, ఉంటే ఈ ప్రాజెక్టు వెంటనే ఆపేస్తానని CM ఛాలెంజ్ విసిరారు.