News October 17, 2024

రిలయన్స్ బోనస్ షేర్ల హిస్టరీ ఇదీ

image

రిలయన్స్ ఇండస్ట్రీస్ బోనస్ ఇష్యూకు 99.92% స్టేక్ హోల్డర్లు ఆమోదం తెలిపారు. దీంతో కంపెనీ అక్టోబర్ 28ని రికార్డు తేదీగా ప్రకటించింది. ఎలిజిబుల్ షేర్ హోల్డర్లకు 1:1 ప్రాతిపదికన బోనస్ షేర్లు జమ చేస్తారు. ఇప్పటి వరకు రిలయన్స్ ఐదు సార్లు బోనస్ షేర్లు ఇచ్చింది. 1980లో 3:5, 1983లో 6:10, 1997, 2009, 2017లో 1:1 రేషియోలో ఇచ్చింది. ప్రస్తుతం కంపెనీ ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ రూ.50,000 కోట్లు.

Similar News

News February 11, 2026

బాలకృష్ణ తర్వాతి సినిమాల లైనప్ ఇదేనా?

image

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇది ఈ ఏడాది దసరాకి రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దీని తర్వాత సితార ఎంటర్టైన్‌మెంట్స్&హరీశ్ శంకర్‌తో ఓ సినిమా చేస్తారని, అది 2027 సంక్రాంతికి రిలీజవ్వొచ్చని సినీ వర్గాలు చెబుతున్నాయి. వివేక్ ఆత్రేయ డైరెక్షన్‌లోనూ బాలయ్య మూవీ ఉంటుందని, మైత్రి సంస్థ నిర్మించబోయే ఈ మూవీ 2027లో రిలీజవుతుందని టాక్.

News February 11, 2026

ఇస్త్రీ చేస్తూ రూ.2లక్షలకు పైగా సంపాదన.. ట్వీట్ వైరల్!

image

సామాన్య ఇస్త్రీ షాపు యజమాని సంపాదన చూసి ఓ మహిళ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్‌ అవుతోంది. ప్రతిరోజూ వందలాది బట్టల ఇస్త్రీ, డ్రై క్లీనింగ్ ద్వారా నెలకు రూ.2 లక్షలకు పైగా ఆ దంపతులు సంపాదిస్తున్నారని తెలిసి ఆమె ఆశ్చర్యపోయారు. ఖర్చులు పోను రూ. 2.37 లక్షలు పొందుతున్నారని, ఇది ఐటీ ఉద్యోగి జీతంతో సమానమని తెలిపారు. ఏ వృత్తి అయినా అంకితభావంతో చేస్తే IT కొలువులకు మించిన ఆదాయం పొందవచ్చని వీరు నిరూపిస్తున్నారు.

News February 11, 2026

చెత్త సేకరణలో కీలక మార్పు.. ఇకపై 4 డబ్బాల్లో!

image

కేంద్రం ‘సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026’ పేరుతో సరికొత్త చెత్త సేకరణ విధానాన్ని తెచ్చింది. ఇకపై ఇంటి వద్దే వ్యర్థాలను నాలుగు రకాలుగా వేరు చేయడం తప్పనిసరి. గతంలో మూడు ఉండగా ఇప్పుడు ఒక డబ్బా పెరిగింది. తడి వ్యర్థాలకు గ్రీన్, పొడి వ్యర్థాలకు బ్లూ, ప్యాడ్లు-డైపర్ల కోసం రెడ్, ఇంట్లోని మెడికల్ వ్యర్థాల కోసం నలుపు డబ్బాలను వాడాలి. పర్యావరణ పరిరక్షణ, రీసైక్లింగ్ సులభతరం చేయడానికి ఈ మార్పు చేశారు.