News October 17, 2024

బతుకమ్మ చీరలు ఎందుకివ్వలేదో సమాధానం చెప్పండి: హరీశ్‌రావు

image

TG: గతంలో KCR ప్రభుత్వం ఇచ్చిన బతుకమ్మ చీరలను ఈ ప్రభుత్వం ఎందుకు నిలిపివేసిందో సమాధానం చెప్పకుండా మంత్రి సీతక్క పొంతనలేని వ్యాఖ్యలు చేస్తున్నారని BRS MLA హరీశ్‌రావు అన్నారు. మ్యానిఫెస్టో ప్రకారం ఈ ప్రభుత్వం నెలకు రూ.2,500 చొప్పున గడిచిన 10 నెలల్లో ప్రతి మహిళకు రూ.25,000 బాకీ పడిందని అన్నారు. హామీల అమలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది గోరంత, చెప్పుకునేది కొండంత అని ఎద్దేవా చేశారు.

Similar News

News November 7, 2025

మంత్రులు, అధికారులకు సీఎం వార్నింగ్

image

AP: ఫైల్స్ క్లియరెన్స్‌లో అలసత్వం జరుగుతోందని సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. మంత్రులు, అధికారులు తమ పనిలో కమిట్‌మెంట్‌ చూపించాలని ఆదేశించారు. కొంతమంది పనితీరు సంతృప్తికరంగా లేదని, ధోరణి మార్చుకోవాలని హెచ్చరించారు. ప్రజలకు సమయానికి సేవలు అందించడమే ప్రభుత్వ బాధ్యత అని గుర్తు చేశారు. అందరం బాధ్యతగా పనిచేయాల్సిందేనని స్పష్టం చేశారు.

News November 6, 2025

రూ.18వేల కోట్ల షేర్ల బైబ్యాక్.. డేట్ ఫిక్స్

image

ఇన్ఫోసిస్ ఈ నెల 14న ₹18వేల కోట్ల విలువైన షేర్లను బైబ్యాక్ చేయనుంది. ఈ బైబ్యాక్‌కు నందన్ నీలేకని, సుధామూర్తి సహా కంపెనీ ప్రమోటర్లు దూరంగా ఉండనున్నారు. వీరికి సంస్థలో 13.05% వాటా ఉంది. వాటాదారులకి ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. 10Cr షేర్లను ₹1,800 చొప్పున కంపెనీ కొనుగోలు చేయనుంది.(కంపెనీ తన సొంత షేర్లను బహిరంగ మార్కెట్/వాటాదారుల నుంచి కొనుగోలు చేయడాన్ని బైబ్యాక్ అంటారు)

News November 6, 2025

సచివాలయాలకు అందరికీ ఆమోదయోగ్యమైన పేరే: మంత్రి డోలా

image

AP: ప్రజల కోరిక మేరకే గ్రామ, వార్డు సచివాలయాల పేర్లు మారుస్తున్నామని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. అందరికీ ఆమోదయోగ్యమైన పేరే పెట్టనున్నట్లు స్పష్టం చేశారు. సచివాలయ వ్యవస్థలో సీఎం చంద్రబాబు సమగ్ర మార్పులు తీసుకొస్తున్నట్లు చెప్పారు. సచివాలయ ఉద్యోగులకు కనీసం జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్ కూడా ఇవ్వకుండా గత ప్రభుత్వం వారి జీవితాలతో ఆడుకుందని మంత్రి విమర్శించారు.