News October 17, 2024
షేక్ హసీనాపై అరెస్ట్ వారెంట్ జారీ

భారత్‌లో ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్ మాజీ PM షేక్ హసీనాపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. NOV 18లోపు ఆమెను అరెస్ట్ చేసి తమ ఎదుట హాజరుపర్చాలని ఆ దేశ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది. రిజర్వేషన్లపై ఆ దేశంలో జరిగిన నిరసనలు హింసాత్మకంగా మారడంతో ఆమె బంగ్లాను వీడిన సంగతి తెలిసిందే. ఆమెపై క్రిమినల్ కేసులు సైతం నమోదయ్యాయి. కాగా ఆమె భారత్ చేరుకున్న తర్వాత బహిరంగంగా ఎక్కడా కనిపించలేదు.
Similar News
News February 5, 2026
మున్సి‘పోల్స్’లో సోషల్ మీడియా వార్

TG: మున్సి‘పోల్స్’ ప్రచారాలు సోషల్ మీడియా వేదికగా మార్మోగుతున్నాయి. నేతల ఇంటింటి ప్రచారాలతో పాటు పార్టీలు SMనూ ఎక్కువగా వినియోగిస్తున్నాయి. తమను గెలిపిస్తే ఏం చేస్తామో చెబుతూనే ప్రత్యర్థి పార్టీలపై ఆరోపణలు, విమర్శలు గుప్పిస్తున్నాయి. కాగా క్షేత్రస్థాయిలో ఈ ఎన్నికల బాధ్యతలను INC మంత్రులకు, BRS నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లకు అప్పగించాయి. వీరి వ్యూహాల ప్రకారమే నడవాలని శ్రేణులకు సూచించాయి.
News February 5, 2026
మచ్చల్ని తగ్గించే జాజికాయ ఫేస్‌ప్యాక్

జాజికాయని వాడడం వల్ల ముఖంపై మచ్చలు తగ్గడమే కాదు. మొటిమలు కూడా రాకుండా ఉంటాయంటున్నారు నిపుణులు. 2 టీ స్పూన్ల జాజికాయ పొడి, తేనె, పాలు కలిపి పేస్ట్ చేయాలి. దీన్ని ముఖానికి అప్లై చేసి 10 నిమిషాల తర్వాత ఫేస్‌ప్యాక్‌ని క్లీన్ చేయండి. ఇలా చేస్తే ముఖం బ్రైట్‌గా కనిపిస్తుంది. దీని వల్ల మొటిమలు, మచ్చలు తగ్గుతాయి. దీని వల్ల ముఖంపై పేరుకుపోయిన అదనపు నూనె కూడా తొలగిపోతుందంటున్నారు.
News February 5, 2026
మోదీపై దాడికే మహిళా ఎంపీల మోహరింపు: BJP MP

నిన్న లోక్‌సభ అర్ధాంతరంగా వాయిదాపడి PM మోదీ ప్రసంగం రద్దవడం తెలిసిందే. అయితే దీనికి కారణం మోదీ కూర్చున్న సీటు చుట్టూ తమ మహిళా MPలను విపక్షం మోహరించడమేనని NDTV పేర్కొంది. నరవణే పుస్తకంపై రాహుల్‌ను అనుమతించకపోవడంతో విపక్షం యుద్ధమార్గంలో వెళ్తున్నట్టుగా ఉందని విశ్లేషించింది. కాగా మోదీపై దాడి చేసేందుకే తమ మహిళా ఎంపీలను PM సీటు వద్ద విపక్షం మోహరించిందని BJP ఎంపీ మనోజ్ తివారీ ఆరోపించారు.


