News October 17, 2024
సెక్షన్6Aపై సుప్రీం తీర్పు: NRCకి గ్రీన్ సిగ్నల్ అన్నట్టే!

సిటిజన్‌షిప్ యాక్ట్‌లోని <<14380027>>సెక్షన్6A<<>>కు సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పునివ్వడంతో NRCకి మార్గం సుగమమైంది. ఈ సెక్షన్ ప్రకారం 1971, MAR 24 తర్వాత అస్సాం వచ్చిన బంగ్లా వలసదారుల్ని గుర్తించి వెనక్కి పంపొచ్చు. పైగా ఈ ప్రక్రియను SCI స్వయంగా పర్యవేక్షిస్తుంది. ఫారినర్స్ యాక్ట్, అదే తరహా చట్టాలను అమలు చేసే పవర్ స్టేట్స్‌కు ఉందన్న కోర్టు అబ్జర్వేషన్స్ బోర్డర్ స్టేట్స్‌కు మార్గదర్శకంగా మారాయి.>comment
Similar News
News January 26, 2026
TET ఫలితాలు.. కీలక అప్‌డేట్

TG: TET ఫలితాల్లో ఈసారి నార్మలైజేషన్ ప్రక్రియ ఉండదని విద్యాశాఖ స్పష్టం చేసింది. దాదాపు అన్ని జిల్లాల్లో ఒకే సెషన్‌లో, ఒకే రకమైన క్వశ్చన్ పేపర్‌తో పరీక్షలు జరగడంతో నార్మలైజేషన్ అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. నోటిఫికేషన్‌లోనూ ఈ అంశాన్ని పేర్కొనలేదు. కాగా 2 సెషన్లలో పరీక్షలు జరిగితే ఒక సెషన్ పేపర్ కఠినంగా, మరో సెషన్‌లో సులువుగా వచ్చే ఛాన్సుంటుంది. అలాంటి సందర్భాల్లో నార్మలైజేషన్ అమలు చేస్తారు.
News January 26, 2026
10వేల కిలోల పేలుడు పదార్థాలు.. రిపబ్లిక్ డే వేళ కలకలం

రిపబ్లిక్ డే ముందు రాత్రి రాజస్థాన్‌లో భారీగా పేలుడు <<18942074>>పదార్థాలు<<>> పట్టుబడటం కలకలం రేపింది. నాగౌర్(D) హార్సౌర్‌లోని ఫామ్‌హౌజ్‌లో పోలీసులు 10వేల KGs అమ్మోనియం నైట్రేట్ బ్యాగులు, డిటోనేటర్లు గుర్తించారు. సులేమాన్ ఖాన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. వాటిని ఎందుకు నిల్వ చేశాడు? క్రిమినల్ హిస్టరీ ఉన్న అతడికి ఇతర రాష్ట్రాల వారితో లింక్‌లు ఉన్నాయా? అనే కోణంలో ఇంటరాగేట్ చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.
News January 26, 2026
భీష్మాష్టమి పూజా విధానం

ఈ పర్వదినాన సూర్యోదయానికి ముందే నిద్ర లేచి తలంటు స్నానం చేయాలి. శాంతికి చిహ్నమైన తెలుపు రంగు దుస్తులు ధరించాలి. పూజా మందిరాన్ని ముగ్గులతో అలంకరించాలి. విష్ణుమూర్తిని తామర పూలు, తులసి దళాలతో అర్చించాలి. పాయసాన్ని నైవేద్యంగా పెట్టాలి. ఉపవాసం ఉండాలి. జాగరణ చేయాలి. తామర వత్తులతో దీపారాధన చేయాలి. విష్ణు సహస్రనామ పారాయణంతో ఇంటికి శుభం కలుగుతుంది. పేదలకు అన్నదానం, గోవులకు గ్రాసం అందించడం ఎంతో శ్రేష్ఠం.


