News October 17, 2024

‘హైడ్రా’పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

image

TG: చెరువుల్లో అక్రమంగా నిర్మించుకున్న భవనాలనే హైడ్రా కూలుస్తోందని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. మూసీ పరీవాహకంలో ఎవరి ఇళ్లను హైడ్రా కూల్చలేదన్నారు. కొందరు మెదడులో మూసీ మురికి కంటే ఎక్కువ విషం నింపుకొని దుష్ప్రచారం చేస్తున్నారని రేవంత్ ధ్వజమెత్తారు. తాము ఉన్నపళంగా, నిర్దయగా ఎవరినీ ఖాళీ చేయించడం లేదని, నిర్వాసితులకు డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయించి, రూ.25వేలు ఇచ్చామని వెల్లడించారు.

Similar News

News October 17, 2024

సురేఖపై పరువు నష్టం కేసు.. రేపు కోర్టుకు KTR

image

TG: మంత్రి సురేఖపై పరువు నష్టం కేసు వేసిన కేటీఆర్ రేపు నాంపల్లి కోర్టులో హాజరుకానున్నారు. జడ్జి ముందు ఆయన తన వాంగ్మూలం ఇవ్వనున్నారు. కాగా నాగచైతన్య, సమంత విడాకుల వ్యవహారంలో నాగార్జున, కేటీఆర్‌పై సురేఖ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆమెపై ఇప్పటికే నాగార్జున డిఫమేషన్ కేసు వేసి, కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు.

News October 17, 2024

భారత్‌ను హేళన చేసిన మాజీ ప్లేయర్.. ఫ్యాన్స్ ఆగ్రహం

image

న్యూజిలాండ్‌పై భారత్ 46 రన్స్‌కే ఆలౌట్ కావడాన్ని సానుకూలంగా తీసుకోవాలని ఇంగ్లండ్ మాజీ ఆటగాడు మైకేల్ వాన్ ట్వీట్ చేశారు. ఆస్ట్రేలియాలో 36 పరుగులకే ఆలౌట్ అయిన విషయాన్ని గుర్తుచేసేలా ‘కనీసం 36 రన్స్‌ను దాటారుగా’ అంటూ హేళన చేశారు. ఆ ట్వీట్‌పై భారత్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత్‌పై ఇంగ్లండ్ 2019 నుంచి గెలవలేదని, ఐర్లాండ్ చేతిలో ఆ జట్టు 52 రన్స్‌కే ఔటైందని కౌంటర్లు వేస్తున్నారు.

News October 17, 2024

బిష్ణోయ్‌కి సల్మాన్ మాజీ ప్రేయసి సందేశం

image

నటుడు సల్మాన్ ఖాన్‌ను చంపాలని చూస్తున్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌ని జూమ్ కాల్ చేయమంటూ ఖాన్ మాజీ ప్రేయసి సోమీ అలీ కోరడం హాట్ టాపిక్‌గా మారింది. ‘నమస్తే లారెన్స్ భాయ్. మీరు జైల్లో ఉన్నా కూడా జూమ్ కాల్స్ చేస్తుంటారని నాకు తెలిసింది. మీతో మాట్లాడే పని ఉంది. దానికి ఏర్పాట్లు చేయండి. నాతో మాట్లాడితే మీకే లాభం. మీ ఫోన్ నంబర్ నాకు ఇవ్వండి’ అని సోమీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.