News October 17, 2024

మూసీ ప్రాజెక్టులో ఒక్క రూపాయి కూడా ఆశించట్లేదు: రేవంత్

image

TG: రాష్ట్రాన్ని, నగరాన్ని బాగుచేయడానికే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తనకు ఇప్పటికే ఆస్తి, అంతస్తులు, పదవి అన్నీ వచ్చాయని చెప్పారు. ఈ సమయంలో ఎవ్వరినో మోసం చేయాల్సిన అవసరం లేదన్నారు. మూసీ ప్రాజెక్టుకు వెచ్చించే రూ.1.50 లక్షల కోట్లలో తాము ఒక్క రూపాయి కూడా ఆశించట్లేదని సీఎం తెలిపారు. తమ మంత్రులు కూడా ప్రజలకు మేలు చేసేందుకే పనిచేస్తున్నారని పేర్కొన్నారు.

Similar News

News February 3, 2026

బంగ్లాదేశ్ మాజీ ప్రధానికి 10 ఏళ్ల జైలు శిక్ష

image

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు<<18311087>> మరో షాక్ <<>>తగిలింది. ఢాకా స్పెషల్‌ జడ్జస్‌ కోర్టు 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. రెండు వేర్వేరు అవినీతి కేసులకు సంబంధించి ఈ తీర్పునిచ్చింది. ఒక్కో కేసుకు 5 ఏళ్ల చొప్పున శిక్ష అనుభవించాలని స్పష్టం చేసింది. పుర్బాచోల్‌లోని రాజుక్‌ న్యూ టౌన్‌ ప్రాజెక్టు కింద ప్లాట్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయన్న అభియోగాలతో హసీనా, ఆమె కుటుంబ సభ్యులకు శిక్ష ఖరారు చేసింది.

News February 3, 2026

NABARDలో 162 పోస్టులు.. దరఖాస్తుకు ఇవాళే లాస్ట్ డేట్

image

NABARDలో 162 డెవలప్‌మెంట్ అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. ఏదైనా డిగ్రీలో కనీసం 50% మార్కులతో ఉత్తీర్ణులైన వారు అప్లై చేసుకోవచ్చు. మొత్తం పోస్టుల్లో APలో 8 పోస్టులు ఉన్నాయి. అభ్యర్థుల వయసు 21 -35ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. ప్రిలిమినరీ ఎగ్జామ్ ఫిబ్రవరి 21న, మెయిన్ ఎగ్జామ్ ఏప్రిల్ 12న నిర్వహిస్తారు. మరిన్ని వివరాలకు https://www.nabard.org చూడండి.

News February 3, 2026

AIIMS బిలాస్‌పుర్‌లో 52 పోస్టులు

image

AIIMS బిలాస్‌పుర్‌ 52 సీనియర్ రెసిడెంట్ (నాన్ అకడమిక్) పోస్టులను భర్తీ చేయనుంది. అర్హతగల వారు FEB 4న ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో MD/MS/DNB, MSc/M. Biotech, PhD అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45ఏళ్లు. మెడికల్ అభ్యర్థులకు నెలకు రూ.67,700+NPA, నాన్ మెడికల్ అభ్యర్థులకు రూ.56,100 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.aiimsbilaspur.edu.in